Sravanthi..యాంకర్ స్రవంతి నిత్యం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా భూమి మీద నిలబడలేకపోతోంది. గాల్లో నా మనసు ఎగురుతోంది అంటూ చెప్పుకొచ్చింది. మరి స్రవంతి మనసు ఇంత సంతోషంతో నిండిపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
గద్దర్ అవార్డ్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా బన్నీ..
దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. నిన్న అనగా జూన్ 14వ తేదీన హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అర్హులైన వారికి ఈ గద్దర్ అవార్డ్స్ ను అందించారు. ఇక ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తెలంగాణ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని, అందుకు తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్పీచ్ కి ప్రముఖులంతా కూడా ఫిదా అయిపోయారు. ఇదిలా ఉండగా.. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) , రేవంత్ రెడ్డి ఒకే స్టేజ్ పై కనిపించడంతో అందరి దృష్టి ఈవెంట్ పైనే పడింది. ఉత్తమ నటుడిగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు అందుకున్న తర్వాత ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు తనకొచ్చిన ఈ అవార్డు ఆర్మీకే అంకితం అంటూ ఎక్స్ ద్వారా షేర్ చేసిన విషయం తెలిసిందే.
ALSO READ : Nivetha Thomas:గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నివేదా థామస్.. గద్దర్ అవార్డ్స్ లో దర్శనం!
బన్నీ మాటలకు గాల్లో తేలుతున్న యాంకర్ స్రవంతి..
ఇదంతా ఇలా ఉండగా ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ కి యాంకర్ స్రవంతి ఎదుటి పడింది. ఇక స్రవంతితో బన్నీ ” చీరలో బాగున్నావ్.. అందంగా కనిపిస్తున్నావు” అంటూ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో స్రవంతి తెగ సంబరపడి పోతోంది. మనం ఎంతగానో ఇష్టపడే హీరో మనం కట్టుకున్న చీర చాలా బాగుందని, అందంగా ఉన్నారు అంటే ఇక భూమి మీద ఆగగలమా అందుకే ఈ క్యూట్ వీడియోను స్రవంతి షేర్ చేస్తూ బన్నీ మాటలకు నేను భూమి మీద నిలబడలేక పోతున్నాను నా మనసు గాల్లో ఎగురుతోంది అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది స్రవంతి చొక్కారపు.
నిజానికి అల్లు అర్జున్ కి హీరోయిన్సే కాదు ఇలా ఎంతోమంది అమ్మాయిలు ఆయన అభిమానులుగా మారిపోయారు.
ఆయనను కలవాలి అని, కనీసం ఒక్క మాటైనా ఆయనతో మాట్లాడాలని కోరుకునే వారు ఎంతోమంది. అలాంటిది ఇప్పుడు స్రవంతిని ఏకంగా బన్నీ పొగిడేయడంతో నువ్వు చాలా లక్కీ అంటూ కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు ఫ్యాన్స్ . ఇక ఆశు రెడ్డి అయితే ఏకంగా నేను సిగ్గు పడిపోతున్నాను అంటూ కామెంట్ పెట్టింది. ఇలా ఎవరికి వారు స్రవంతి అదృష్టవంతురాలు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . ఏదిఏమైనా బన్నీ అన్న ఆ రెండు మాటలు ఇప్పుడు స్రవంతికి ఊపిరి ఆడనంత సంతోషాన్ని కలిగించాయని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
?igsh=Nmk0amt4MWR3enFp