BigTV English

Akhanda 2: అఖండ 2 నైజాం హక్కుల కోసం భారీ డీల్ …రంగంలోకి దిల్ రాజు!

Akhanda 2: అఖండ 2 నైజాం హక్కుల కోసం భారీ డీల్ …రంగంలోకి దిల్ రాజు!

Akhanda 2: బాలకృష్ణ(Balakrishna) బోయపాటి కాంబినేషన్ అంటే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయమని చెప్పాలి. ఈ విధంగా ఇండస్ట్రీలో కొన్ని సూపర్ హిట్ కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి వాటిలో బోయపాటి బాలకృష్ణ కాంబో కూడా ఒకటి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడు సినిమాలు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక త్వరలోనే ఆఖండ 2(Akhanda 2) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ ఐదో తేదీవ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోందని తెలుస్తోంది.


నైజాం హక్కుల కోసం దిల్ రాజు..

ఇక ఈ సినిమా రిలీజ్ హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం హక్కుల(Nizam Rights) కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నైజాం హక్కుల కోసం దిల్ రాజు భారీగా ఆఫర్ చేసినట్టు సమాచారం. నైజం ప్రాంతంలో సుమారు 450 థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా నైజాం హక్కుల కోసం దిల్ రాజు ఏకంగా 30 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం సినిమా పక్క బ్లాక్ బాస్టర్ అని స్పష్టం అవుతుంది.

సనాతన ధర్మ పరిరక్షకుడిగా..

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుపుకుంటుందని చెప్పాలి. మరి దిల్ రాజు ఆఫర్ చేసిన విధంగానే ఈయన నైజం హక్కులను సొంతం చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల ఓజీ సినిమా నైజాం హక్కులను కూడా దిల్ రాజు కైవసం చేసుకుని మంచి లాభాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆఖండ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Sreenu)వెల్లడించారు. ఇక ఇందులో బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.


పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2..

మొదటిసారి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హిందీలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. అక్కడ కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా నటి సంయుక్త మీనన్(Samyuktha Menon) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించగా నందమూరి తేజస్విని సమర్పణలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్(S.A.Thaman) సంగీత దర్శకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ రాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు.

Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లిలో ఇన్ని ట్విస్టులా..అందుకే ఆలస్యం అయిందా?

Related News

Keerthy Suresh: జగపతి బాబుకి క్షమాపణలు చెప్పిన కీర్తి సురేష్‌.. కారణమేంటంటే!

Pooja hegde: పూజా హెగ్డే బర్త్డే.. స్పెషల్ విషెస్ తెలిపిన రూమర్ద్ బాయ్ ఫ్రెండ్.. ఫోటో వైరల్!

Siddhu Jonnalagadda: ఆ సీన్‌ చేయనంటూ రాశీఖన్నా కోపంతో వెళ్లిపోయింది.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్

Toxic: టాక్సిక్ నుండి హీరో లుక్ లీక్.. ఆ స్వాగ్ చూసారా?

Telusu Kada Trailer: గ్యారెంటీ ఇవ్వటానికి నేను సేల్స్ మ్యాన్ కాదు.. క్రేజీగా ‘తెలుసు కదా’ ట్రైలర్ !

Nuvve Kavali: నువ్వే కావాలి@25 ఏళ్లు.. క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవే!

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లిలో ఇన్ని ట్విస్టులా..అందుకే ఆలస్యం అయిందా?

Big Stories

×