Amaravati: కాలేజీలు ప్రారంభంకావడంతో సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల అవుతున్నాయి. తాజాగా ఏపీలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను ఆన్ లైన్ ద్వారా విడుదల చేశారు.
ఏపీలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు
ఎట్టకేలకు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఫలితాలను మంత్రి నారా లోకేశ్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. మే 25 నుంచి జూన్ 4 మధ్య జరిగిన పరీక్షలకు దాదాపు 95 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 78,261 మంది ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు.
ఈసారి పరీక్షల్లో పాసైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు మంత్రి లోకేశ్. గడిచిన ఏడాదితో పోల్చితే 6 శాతం పైగానే విద్యార్థులు విజయం సాధించారు. పదో తరగతి ఫలితాలను https://results.bse.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. లేకుంటే వాట్సప్ నెంబర్ 955230009 ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు అధికారులు.
గతేడాది కంటే ఆరుశాతం పైగానే ఉత్తీర్ణత-మంత్రి లోకేష్
ఎస్‌ఎస్‌సి పరీక్షల తర్వాత విద్యార్థులకు ప్రత్యేక విద్యా సహాయం, ఇంటెన్సివ్ కోచింగ్, వ్యక్తిగత మార్గదర్శకత్వం ప్రభుత్వం అందించిందన్నారు సదరు మంత్రి. దాదాపు మూడువారాల కార్యాచరణ ప్రణాళిక విజయవంతమైందనడానికి ఈ ప్రోత్సాహకరమైన ఫలితాలు నిదర్శమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విజయానికి కారణమైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Happy to announce the results of the SSC Advanced Supplementary Examinations (ASE) – May 2026.
Out of 94,990 students who appeared for the examinations, 78,261 students have successfully passed, achieving an impressive pass percentage of 82.39%—a significant improvement from…
— Lokesh Nara (@naralokesh) June 19, 2026