Shreyas Iyer Injury: భారత్ – ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా మూడో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్ ని సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కున్నాడు. ప్రస్తుతం పరిస్థితి కాస్త క్షీణించినట్లు సమాచారం. అయితే స్కానింగ్ లో శ్రేయస్ అయ్యర్ ప్లీహనీకి గాయం అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ గాయం కారణంగా ఇంటర్నల్ బ్లీడింగ్ ప్రారంభమై ప్రమాదవ స్థాయి పెరిగినట్లు సమాచారం.
Also Read: Ind vs Aus: ఉబర్ లో తిరుగుతున్న టీమిండియా ప్లేయర్లు.. ఏకంగా ఆస్ట్రేలియా వీధుల్లోనే
దీంతో డాక్టర్లు వెంటనే శ్రేయస్ అయ్యార్ ని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి దేవజీత్ సైకియా శ్రేయస్ అయ్యర్ గాయంపై అప్డేట్ ఇచ్చారు. “శ్రేయస్ అయ్యర్ పక్కటెముకలకు గాయం అయింది. స్ప్లీన్ కి గాయం కావడంతో ఇంటర్నల్ బ్లీడింగ్ ఏర్పడింది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ పరిస్థితి స్థిరంగా ఉంది. సిడ్నితో పాటు భారత్ లోని నిపుణుల సలహాలతో పర్యవేక్షణ కొనసాగుతుంది. అయ్యర్ త్వరితగతిన కోలుకుంటున్నారు. జట్టు డాక్టర్లు ఆయనని నిత్యం పరిశీలిస్తూ నివేదికలు పంపిస్తున్నారు” అని తెలిపారు.
శ్రేయస్ అయ్యర్ తల్లిదండ్రులను త్వరలో సిడ్నీకి పంపేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ తల్లిదండ్రుల కోసం ఏర్పాటు చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. వీలైనంత తొందరగా కుటుంబ సభ్యులను సిడ్నికి పంపించేలా ఏర్పాట్లు చేస్తుంది బీసీసీఐ. అయితే వారు ఎప్పుడు సిడ్నీకి వెళతారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. శ్రేయస్ అయ్యర్ తల్లిదండ్రులు ఇద్దరు ప్రయాణం చేస్తారా..? లేదా..? అనేది కూడా అస్పష్టంగా ఉంది. కానీ వీలైనంత తొందరగా ఒక కుటుంబ సభ్యుడు ఆసుపత్రిలో అతనితో పాటు ఉండనున్నట్లు సమాచారం.
శ్రేయస్ అయ్యర్ తల్లిదండ్రులకు అర్జెంట్ వీసా కోసం దరఖాస్తు చేసినట్లు అయ్యర్ కుటుంబ సన్నిహిత వర్గాలనుంచి వస్తున్న సమాచారం. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి దృశ్య వెంటనే వీసా మంజూరు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు శ్రేయస్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులలో సందేహాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు వైద్యుడు రిజ్వాన్ శ్రేయస్ అయ్యర్ తో ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి.
Also Read: Shreyas Iyer ICU: డేంజర్‌లో శ్రేయాస్ అయ్యర్…అసలు గాయం ఎక్కడ అయిందంటే
శ్రేయస్ అయ్యర్ కి చాలా కాలంగా గాయాలు అవుతున్నాయి. గత నాలుగు సంవత్సరాల లో అయ్యర్ కి 4 పెద్ద గాయాలు అయ్యాయి. 2021 లో భుజం గాయం, 2023లో నడుము భాగంలో గాయం, 2024లో మరోసారి నడుములో అసౌకర్యం, ప్రస్తుతం పక్కటెముక గాయంతో బాధపడుతున్నాడు. మూడుసార్లు బలమైన పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. ఈసారి కూడా అలాగే తిరిగి త్వరగా జట్టులో చేరాలని ఆశిస్తున్నారు అభిమానులు. కానీ ఈ గాయం కారణంగా అతడు చాలా రోజులపాటు జట్టుకు దూరమయ్యే పరిస్థితులు తలెత్తాయి.