Shocking Video: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయాలని ఓ యువకుడు హైటెన్షన్ టవర్ పై నుంచి దూకేశాడు. పోలీసులు, విద్యుత్ అధికారులు కిందకి దించే ప్రయత్నంలో వారి నుంచి తప్పించుకొని టవర్ పై నుంచి దూకాడు. టవర్ కింద బురదలో పడడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి హై టెన్షన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కి హల్ చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ యువకుడిని టవర్‌పైకి నుంచి దించేందుకు ప్రయత్నించారు. టవర్‌పై ఉన్న వ్యక్తిని సురక్షితంగా కిందకు దించేందుకు విద్యుత్ అధికారులు ప్రయత్నించారు. క్రేన్ సహాయంతో వ్యక్తిని కిందకు దించడానికి ప్రయత్నిస్తుండగా అతడు కిందకు దూకేశాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సహాయంతో అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
విద్యుత్ సిబ్బంది అతి కష్టం మీద యువకుడి దగ్గరకు వెళ్లి కాపాడే ప్రయత్నం చేశారు. ఒకరు దగ్గరికి వెళ్లి యువకుడి చేయి పట్టుకునే సమయంలో వారి నుంచి తప్పించుకుని టవర్‌పై నుంచి దూకి బురదలో పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
హైటెన్షన్ టవర్ పై నుంచి దూకిన వ్యక్తి
క్రేన్ సహాయంతో వ్యక్తిని కిందకు దించడానికి ప్రయత్నిస్తుండగా కిందకు దూకేసిన వ్యక్తి
వ్యక్తికి తీవ్ర గాయాలు.. 108 సహాయంతో స్థానిక ఆసుపత్రికి తరలింపు https://t.co/Jpcszmbyxk pic.twitter.com/SxMjY0aK3c
— ChotaNews App (@ChotaNewsApp) October 27, 2025