Tamannaah Bhatia: తమన్నా భాటియా (Tamannaah Bhatia) సౌత్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. నటిగా తమన్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్దన్నర కాలం పూర్తి అవుతుంది. ఇప్పటికీ కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా సినిమాలలోనూ ,వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే నటిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న తమన్నా ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలలో స్పెషల్(Special Songs) సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించారు.
ఒకప్పుడు హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేసేవారు కాదు ఇలా స్పెషల్ సాంగ్స్ చేయడం కోసం కొంతమంది హీరోయిన్లు ఉండేవారు. ఏదైనా సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంది అంటే వారిని మాత్రమే దర్శక నిర్మాతలు అప్రోచ్ అయ్యేవారు. కానీ ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్ సైతం స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో స్పెషల్ సాంగ్స్ చేసే హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి రాఖీసావంత్(Rakhi sawant) తమన్న పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమన్నా ఇటీవల ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ పై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో రాఖీసావంత్ స్పందించారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. తమన్నా ఒకానొక సమయంలో కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఇలా హీరోయిన్ గా కొనసాగిన తమన్నా ఇటీవల కాలంలో కేవలం 5 లక్షల రూపాయల కోసం స్పెషల్ సాంగ్స్ చేస్తూ మా కడుపు కొడుతోందని రాఖీసావంత్ మండిపడ్డారు. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుని తమన్నా లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఏంటని, విలువలు లేకుండా ఉండకూడదు అంటూ తమన్న పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూనే మరోవైపు తమన్నతో తనకు ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేవని తెలియజేశారు.
తెలుగు సినిమాలకు దూరంగా..
ఏది ఏమైనా రాఖీ సావంత్ తమన్నా గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈ ముద్దుగుమ్మకు స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశాలు కోల్పోతున్న నేపథ్యంలోనే అలా మాట్లాడి ఉంటారని మరికొందరు ఈమె వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు. మరి రాఖీ సావంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై తమన్న స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక తమన్నా విషయానికి వస్తే ఇటీవల ఈమె చివరిగా తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్(Bhola Shankar) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా తర్వాత తమన్నా తెలుగులో ఎలాంటి కొత్త సినిమాలను ఇప్పటివరకు ప్రకటించలేదు.
Also Read: Rajamouli: బాహుబలి సినిమాలో జక్కన్న మెచ్చిన సీన్ అదేనా..అంత ప్రభావితం చేసిందా?