ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు ఇండియన్ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన నగరాలు, పట్టణాలు, తీర ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంది. వీకెండ్స్, సెలవు దినాలతో పాటు రద్దీగా ఉండే దక్షిణ కారిడార్లలో సులభ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అదనపు సర్వీసులను నడిపించనుంది. సికింద్రాబాద్, అనకాపల్లి, కాకినాడ టౌన్, మైసూర్, బరౌని, చెన్నై లాంటి కీలక గమ్యస్థానాల మధ్య కనెక్టివిటీని మరింత మెరుగుపరచబోతోంది. ప్రత్యేక రైలు సర్వీసుల ద్వారా మూడు రాష్ట్రాల ప్రయాణీకులకు ఈజీ ప్రయాణాన్ని అందించనుంది.
సికింద్రాబాద్, అనకాపల్లి మధ్య వీకెండ్ స్పెషల్ రైళ్లు నడుస్తాయి. ప్రతి శుక్రవారం తిరిగి సర్వీసులు షెడ్యూల్ చేయనుంది సౌత్ సెంట్రల్ రైల్వే. ప్రయాణికులు, వీకెండ్ ప్రయాణికులకు ఈ సర్వీసులు అనుకూలంగా ఉండనున్నాయి. ఈ వీకెండ్ ప్రత్యేక రైళ్ల ద్వారా, సాధారణ సర్వీసులలో రద్దీని ఎదుర్కొనే ప్రయాణీకులకు ప్రత్యామ్నాయాన్ని అందించనుంది. ఈ రైళ్లతో పాటు కాకినాడ టౌన్, మైసూర్ మధ్య 16 ప్రత్యేక సర్వీసులు నడుస్తాయి. వీటి ద్వారా తూర్పు తీర ప్రాంతం, దక్షిణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని గణనీయంగా బలెపేతం అవుతుంది. పర్యాటకులు, బిజినెస్ ట్రావెలర్స్, విద్యార్థులకు ప్రయాణం మరింత సులభం కానుంది. ముఖ్యంగా వారాంతాల్లో, సెలవు దినాల్లో ఇంటర్ సిటీ ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఈ రైళ్లు నడవనున్నాయి.
అక్టోబర్ 29న బరౌని- చెన్నై బీచ్ మధ్య వన్ టైమ్ స్పెషల్ రైలును షెడ్యూల్ చేసినట్లు వెల్లడించింది. ఇది రద్దీ సమయంలో ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణీకులకు ఉపయోగపడుతుంది. అన్ని ప్రత్యేక రైళ్లు ఆయా మార్గాల్లోని స్టేషన్లలో ఆగుతాయి. పట్టణ, చిన్న పట్టణాల నుంచి వచ్చే ప్రయాణీకులకు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ విధానం నెట్‌వర్క్ అంతటా ప్రయాణీకుల రద్దీని సమానంగా పంపిణీ చేయడంలో సహాయపడుతుంది. ప్రధాన స్టేషన్లలో రద్దీని నివారిస్తుంది.
Read Also: హైదరాబాద్ TO విజయవాడ.. ఇక ఆ రైల్లో రిజర్వేషన్ లేకుండానే వెళ్లొచ్చు!
ఈ అదనపు రైళ్లు సున్నితమైన కార్యకలాపాలు, మెరుగైన సీటింగ్ లభ్యత, ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అనుభవాన్ని ఇస్తాయి. ఈ నిర్ణయం కారణంగా సాధారణ రైళ్లలో రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఈ ప్రత్యేక సర్వీసులలో సీట్లను పొందడానికి ప్రయాణీకులు రైలు షెడ్యూల్ ను చెక్ చేసి, టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
Read Also: రైల్లో టాయిలెట్‌నే బెడ్ రూమ్‌గా మార్చేసుకొని ప్రయాణం, అట్లుంటది మనతోటి!