ఐతే APPSC తీరుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని, పరీక్ష వాయిదా వేయాలంటూ లేఖ రాశారు. అభ్యర్థులు లెటర్ రాసిన 32 గంటల తర్వాత APPSC రిప్లై ఇచ్చింది. అయితే.. MLC ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. గ్రాడ్యుయేట్లకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమంటూ బోర్డు రిప్లై ఇచ్చింది. ఆదివారం జరగాల్సిన పరీక్ష వాయిదా పడిందంటూ కొందరు దుష్ప్రచారం చేశారని కేసు కూడా పెట్టారు. ఇక తాజాగా పరీక్ష యథావిథిగా కొనసాగుతుందని చెప్పింది. చివరి నిమిషంలో ప్రకటించడంతో.. వందల కిలో మీటర్లు ఎలా వెళ్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి ఏపీపీఎస్పీ గ్రూప్-2 అభ్యర్ధులు- ప్రభుత్వానికి వారి డిమాండ్లు ఇవే..
అయితే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై..APPSC ఛైర్మన్ అనురాధ తీసుకున్న ఇండిపెండెంట్ డెసిషన్ ఇప్పుుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయాలని కోరినా.. APPSC మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. వాస్తవానికి కమిషన్ అనేది ఓ ఇండిపెండెంట్ సంస్ధ. వాటి నిర్ణయాలు కూడా అలానే ఉండాలి. దీంతో ఇప్పుడు APPSC తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. ప్రభుత్వ ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా పనిచేస్తోందని కితాబిస్తున్నారు. పరీక్షలు రాసేవారు కూడా..రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా.. టాలెంట్‌తో జాబ్ సంపాదించుకోవాలని సూచిస్తున్నారు.