BigTV English

Shruti Hassan: ఎట్టకేలకు ప్లాస్టిక్ సర్జరీపై స్పందించిన శృతి.. ఏమన్నదంటే..?

Shruti Hassan: ఎట్టకేలకు ప్లాస్టిక్ సర్జరీపై స్పందించిన శృతి.. ఏమన్నదంటే..?

Shruti Hassan:సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో.. ఉన్నన్ని రోజులైనా ప్రేక్షకులను మెప్పించడానికి అందంగా తయారవడానికి.. అటు హీరోలు, ఇటు హీరోయిన్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమ రూపు రేఖలు మార్చుకోవడానికి ఎక్కువగా సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ సర్జరీల తర్వాత కొంతమంది సర్జరీలపై స్పందించరు. కానీ ఈ సర్జరీల వల్ల ముఖంలో వచ్చిన మార్పుల గురించి బహిరంగంగా చెప్పిన తారలలో శృతిహాసన్ (Shruti Hassan).కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి పాన్ ఇండియా స్టార్ డంను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో ఈమె కూడా ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. కానీ ఆ తర్వాత పడిన హిట్స్ కారణంగా గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఇప్పుడు కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, తాను చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ గురించి మాట్లాడడంతో సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.


అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా – శృతిహాసన్..

ఇక ఈ విషయంపై శృతిహాసన్ మాట్లాడుతూ.. “నేను నా ముక్కును సరి చేసుకున్నాను. ఇంతకుముందు నా ముక్కు చాలా భిన్నంగా ఉండేది. అంతకుముందు నేను నా మొదటి సినిమా చేసినప్పుడు షూటింగ్ సమయంలో నా ముక్కుకు గాయమైంది. దీంతో ట్రీట్మెంట్ చేయించుకున్నాను. దాన్నే అవకాశంగా తీసుకొని మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ఉపయోగించుకోకూడదు అని ఆలోచించి, ఇక అప్పుడే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. అయితే దీని గురించి చెప్పడానికి ఎలాంటి మొహమాటం లేదు” అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. అయితే ఇది విన్న చాలామంది శృతిహాసన్ చాలా గ్రేట్ తాను చేయించుకున్న సర్జరీపై స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది ప్లాస్టిక్ సర్జరీకి తన గాయాన్ని ఒక సాకుగా చూపిస్తోంది అంటూ విమర్శించారు.


నా శరీరం నా ఇష్టం – శృతిహాసన్..

దీనిపై కూడా శృతిహాసన్ మాట్లాడుతూ..” లైఫ్ ఛాయిస్ ల గురించి ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నా శరీరం కాబట్టి నా ఇష్టం. నేను అన్నీ కూడా సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటాను. నా శరీరంలో మార్పులు చేసుకోవడం అంటే నాకు మరింత ఇష్టం” అంటూ చెప్పుకు వచ్చింది. ఇక ప్రస్తుతం శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఎవరి శరీరాన్ని వారు సరిదిద్దుకోవడంలో తప్పులేదు అని కొంతమంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇకపోతే శృతిహాసన్ చివరిసారిగా ప్రభాస్(Prabhas ) – ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్లో వచ్చిన సలార్(Salaar ) సినిమాలో నటించి ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమా సీక్వెల్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరొకవైపు అడివి శేష్ (Adivi shesh) హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది శృతిహాసన్. కానీ మేకర్స్ తో కొంత విభేదాలు రావడంతో సినిమా నుండి తప్పుకుంది. ఇప్పుడు కోలీవుడ్ లో రెండు మూడు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారింది శృతిహాసన్. మొత్తానికి అయితే శృతిహాసన్ ఇప్పుడు వరుస సినిమాలతో మరింత బిజీగా మారిపోయిందని చెప్పవచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×