BigTV English

APPSC Group -II : రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి ఏపీపీఎస్పీ గ్రూప్ -II అభ్యర్థులు – ప్రభుత్వానికి వారి డిమాండ్లు ఇవే..

APPSC Group -II : రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి ఏపీపీఎస్పీ గ్రూప్ -II అభ్యర్థులు – ప్రభుత్వానికి వారి డిమాండ్లు ఇవే..

APPSC Group -II : మరికొన్ని గంటల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ -2  మెయిన్స్ పరీక్షలు జరగనున్న తరుణంలో.. ఏపీలోని అనేక ప్రాంతాల్లో గ్రూప్ -2 అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. రోడ్లపైకి వచ్చిన యువతీ, యువకులు ప్రభుత్వానికి, ఏపీపీఎస్పీ బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. పరీక్షల నిర్వహణలో లోపాలున్నాయని, వాటిని సరిదిద్ది పరీక్షలు నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళనలతో అనేక చోట్ల రహదారులు స్థంభించిపోయాయి. 0


రాత్రి వేళల్లో కూడా యువతీ, యువకులు రోడ్ల మీదకు వచ్చి తమకు న్యాయం చేయాలి అంటూ పెద్దగా నినాదు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లోని మెయిన్ రోడ్లను దిగ్బంధించారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గ్రూప్ 2 అభ్యర్థులు ఇలాగా రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. అయినా.. ప్రభుత్వం తమ అభ్యర్థనను పట్టించుకోవడం లేదని, పరీక్షల నిర్వహణలో తప్పులు ఉన్నాయని వాటిని సరిచేసి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తప్పుడు విధానాన్ని అవలంబిస్తే సమర్థులు నష్టపోవాల్సి వస్తుందని, ఏళ్లుగా పడుతున్న కష్టం అంతా వృథా అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల ఆందోళన సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏపీపీఎస్సీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గ్రూప్-2 పరీక్ష ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాయిదా పడుతుందని ప్రచారం జోరుగా సాగింది. కానీ ఏపీపీఎస్సీ మాత్రం ఈ వార్తలను ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేసింది. దాంతో.. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. చివరి నిముషం వరకు పరీక్షలు వాయిదా పడతాయని ఆశించగా,  నిరాశ ఎదురవ్వడం,  పరీక్షల్లో అభ్యర్థుల డిమాండ్లను నెరవేర్చకపోవడంతో.. నిరసనలను తీవ్ర తరం చేశారు.


ప్రస్తుత విధానంలో అనుసరిస్తున్నట్లుగా హారిజెంటల్ రిజర్వేషన్ ను పక్కనపెట్టాలని, వర్టికల్ రిజర్వేషన్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. అలాగే జీవో నెంబర్ 77ను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. నిరసనలను కొనసాగిస్తామని ప్రకటించారు. ఏపీపీఎస్సీ మూర్ఖంగా ప్రవర్తిస్తుందని, అభ్యర్థులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న రోస్టర్ విధానాన్ని ఎందుకు సవరించడం లేదంటూ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహిస్తే వాటి ఫలితాలు వచ్చే సమయానికి కచ్చితంగా పరీక్షల ఫలితాలను కోర్టును నిలిపివేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే రోస్టర్ విధానాల్లో తప్పులపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వెయ్కికి పైగా కేసులు నమోదు అయ్యాయని తెలుపుతున్నారు. నోటిఫికేషన్లు రద్దు అయితే అభ్యర్థులకు ఎప్పటికీ న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.

Also Read : AP Inter Exams 2025: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

గత 20 రోజులుగా శాంతియుతంగానే ధర్నాలు ఆందోళన చేస్తుండగా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేస్తున్నారంటూ నిరుద్యోగుల ఆశలతో ఆటలాడుకుంటున్నారు అంటూ అగ్రహిస్తున్నారు. తొలుత ఏపీపీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా వార్తలు పంపించిన ప్రభుత్వం.. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్ అందుకు అంగీకరించడం లేదంటూ చెప్పటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×