ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే మామూలు విషయం కాదు. నిరంతర శ్రమతో పాటూ పట్టుదల, ఎంతో కృషి అవసరం. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం కోసం కొంతకాలం కష్టపడి ఆ తరవాత మనకేం వస్తుంది లే అని వదిలేస్తారు. ఒక ఉద్యోగం సాధించాలంటే ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్ అన్నింటిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. 24 గంటలూ పుస్తకాలతో కుస్తీ చేస్తేనే సక్సెస్ వస్తుంది. ఇక ఒకసారి ఉద్యోగం వచ్చిందంటే చాలు ఊపిరి పీల్చుకున్నట్టే.
Also read: కేటీఆర్ ఫెయిల్.. బీఆర్ఎస్‌కు దిక్కెవరు? ఉద్యమకారులకు ప్రాధాన్యమేది?
చిన్న ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా సంతృప్తి చెంది సైలెంట్ గా ఉంటారు. కానీ ఈ యువకుడు ఒక ఉద్యోగంతో సరిపెట్టుకోలేదు. చిన్న ఉద్యోగం వచ్చింది కదా ఇంకేటి.. ఏ సమస్య లేదు హాయిగా ఉంటానని అనుకోలేదు. ఆ తరవాత కూడా కష్టపడ్డాడు. తన లక్ష్యం మరింత పెద్దదాన్ని ఎంచుకున్నాడు. ఆ దిశగా సాగుతూ ఏకంగా ఎనిమిది ప్రభుత్వ ఉద్యోగాలను తన జేబులో వేసుకున్నాడు. అది కూడా ఎలాంటి కోచింగ్ లేకుండానే సాధించడం ఆశ్చర్యకరం.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన రాయకుల రాజేశ్ అనే యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమనేది ఒక కల. ఆ కల కోసం ఎంతో కష్టపడి ఎలాంటి కోచింగ్ లేకుండా పంచాయితీ సెక్రటరీ ఉద్యోగం సాధించాడు. దానితో సరిపెట్టుకోకుండా ఆ తరవాత PGT గురుకుల, ASO, TGT గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2, గ్రూప్-4, DSC, JL ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు. చివరికి తనకు ఇష్టమైన PGT(SOCIAL)గా పనిచేస్తున్నాడు. మల్లంపల్లిలో ప్రస్తుతం ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. సంతోష్ తమ్ముడు కూడా అన్న స్పూర్తిగా గ్రూప్ -4 ఉద్యోగం సాధించి ప్రస్తుతం గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. దీంతో అన్నదమ్ములిద్దరూ గ్రామంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.