BigTV English
Advertisement

BSNL: బీఎస్ఎన్‌ఎల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. నెలకు రూ.50,500 జీతం, ఇంకెందుకు ఆలస్యం బ్రో

BSNL: బీఎస్ఎన్‌ఎల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. నెలకు రూ.50,500 జీతం, ఇంకెందుకు ఆలస్యం బ్రో

BSNL: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుంచి నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.


భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఈ నియామకం టెలికాం, ఫైనాన్స్ విభాగాల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు గడువు తేదీలను ఇంకా ప్రకటించలేదు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 120


భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెలికాం), సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పోస్టుల వివరాలు: 

సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెలికాం)- 95 పోస్టులు
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్)- 25 పోస్టులు

విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్‌ లేదా తత్సమాన ఇంజినీరింగ్‌ డిగ్రీ, సీఏ, సీఎంఏ పాసై ఉండాలి. ఈ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.

జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.24,900- రూ.50,500 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ ఎంపిక విధానం:  కంప్యూటర్‌ ఆధారిత మల్టిపుల్‌ చాయిస్‌ అబ్జెక్టివ్‌ టైప్‌ రాత పరీక్ష, సర్టిఫికేట్ పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

నోట్: దరఖాస్తు తేదీలను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించనున్నారు.

అఫీషియల్ వెబ్ సైట్:  https://bsnl.co.in/

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 120

దరఖాస్తుకు చివరి తేది: త్వరలో ప్రకటించనున్నారు..

ALSO READ: RRB NTPC: ఇంటర్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. మంచి వేతనం, ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్ గురూ..

Related News

RRB NTPC: ఇంటర్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. మంచి వేతనం, ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్ గురూ..

Constable: 7565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేశారా…? ఇంకా నాలుగు రోజులే గడువు, డోంట్ మిస్

Intelligence Bureau: ఐబీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు, నెలకు రూ.1,42,400 జీతం

AP TET 2025: ఏపీ టెట్ ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ.. సిలబస్, పరీక్ష విధానం ఇలా

Inter exams: స్టూడెంట్స్‌కు బిగ్ అలర్ట్.. తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

UCO Bank: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్థానిక భాష వస్తే చాలు, ఇదే మంచి అవకాశం

AP SSC Exams 2026: ఏపీ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అప్డేట్.. మార్చి 16 నుంచి పరీక్షలు.. రూట్ మ్యాప్ తో హాల్ టికెట్లు

Big Stories

×