 
					Abhishek Sharma: వన్డే సిరీస్ లో భారత జట్టును ఓడించిన ఆస్ట్రేలియాకు టి-20 ఫార్మాట్ లో ఓడించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే భారత్ గత రెండు సంవత్సరాలలో సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. సిరీస్ ఎక్కడ జరిగినా టి-20 ఫార్మాట్ లో భారత ఆటగాళ్లు దుమ్ము లేపుతారు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా రూపంలో కఠిన ప్రత్యర్థిని ఎదుర్కొంటుంది భారత్. భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 టి-20 మ్యాచ ల సిరీస్ లో భాగంగా తొలి టీ-20 అక్టోబర్ 29న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ తొలి టి-20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కాన్ బెర్రా వేదికగా జరగాల్సిన మ్యాచ్ కి వరుణుడు అడ్డుగా నిలిచాడు. దీంతో పట్టుమని పది ఓవర్ల ఆట కూడా సాగలేదు.
Also Read: Test Rules: టెస్టుల్లో కొత్త సంప్రదాయం.. ఇక రెండు టీ బ్రేకులు!
భారత్ 9.4 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 97 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ ని నిలిపివేశారు. అయితే వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ని రద్దు చేశారు. ఆసియా కప్ 2025లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ.. ఈ తొలి టి-20లో దారుణంగా విఫలమయ్యాడు. 14 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రతి బంతిని ముందుకు వచ్చి షాట్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అభిషేక్ శర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని చెప్పడానికి సందేహాలు అక్కర్లేదు. నేడు ఆస్ట్రేలియాతో జరగబోయే రెండవ టి-20 లో చెలరేగడానికి సిద్ధంగా ఉన్నాడు అభిషేక్ శర్మ.
అక్టోబర్ 31వ తేదీన రెండవ వన్డే మేల్ బోర్న్ వేదికగా 1:45 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో రెండవ వన్డే కోసం భారత జట్టు మెల్ బోర్న్ కి బయలుదేరిన సందర్భంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆటగాళ్లు ఏదైనా చిన్నపాటి పొరపాటు చేసినప్పుడు వారిని ఆటపట్టించడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే భారత జట్టు సభ్యులు మేల్ బోర్న్ కి వెళుతున్న సమయంలో.. అభిషేక్ శర్మని ట్రోల్ చేశారు అతడి సహచరులు. ఎందుకంటే.. అభిషేక్ శర్మ చేతిలో ఉన్న బ్యాగ్ కాస్త విచిత్రంగా కనిపించింది. ఆ బ్యాగ్ లిమిటెడ్ ఎడిషన్ అంటూ ఆట పట్టించారు. అభిషేక్ శర్మ చేతిలో ఉన్న ఈ రంగురంగుల బ్యాగ్ ని చూసి ట్రోల్ చేశారు అతడి సహచర ఆటగాళ్లు. స్టార్స్ మరియు గులాబీ, తెలుపు, ఎరుపు రంగులతో అభిషేక్ శర్మ చేతిలో ఉన్న బ్యాగ్ ని చూపిస్తూ ఆర్షదీప్ సింగ్, గిల్ ఆటపట్టిస్తున్నారు. దీంతో అభిషేక్ శర్మ బ్యాగ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేకు ముందే అభిషేక్ ని ఎదుర్కోవడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని అన్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్. “అభిషేక్ శర్మ ఎంతో అద్భుతమైన ఆటగాడు. ఐపీఎల్ లో అతడు సన్రైజర్స్ హైదరాబాద్ తరపున చక్కగా ఆడాడు. అతడు మాకు ఓ చాలెంజ్. కానీ అతడిని ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడి మనల్ని మనం పరీక్షించుకోవాలి” అని చెప్పుకొచ్చాడు. ఇక అభిషేక్ శర్మ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ టి-20 బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. అతడు 24 ఇన్నింగ్స్ లలో 36.91 యావరేజ్ తో 868 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే మొదటి టీ-20 లో విఫలమైన అభిషేక్ శర్మ.. రెండవ టి-20 లో రాణిస్తాడా..? లేదా..? అన్నది వేచి చూడాలి.
?utm_source=ig_web_copy_link