SECL Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారికి ఇది మంచి అవకాశం. బీఈ, బీటెక్, డిప్లొమా పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ (ఎస్ఈసీఎల్) లో 543 అసిస్టెంట్ ఫోర్ మెన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నవంబర్ 9న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 543
సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో అసిస్టెంట్ ఫోర్ మెన్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్, బీఈ, డిప్లొమా పాసై ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: అక్టోబర్ 16
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 9
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: వ్రాత పరీక్ష ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. (ఓఎంఆర్ షీట్ ఆధారంగా ఎగ్జామ్ పెడుతారు. ఈ ఎగ్జా్మ్ లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. జనరల్ అభ్యర్థులకు 35 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 శాతం మార్కులు రావాలి.)
వయస్సు: వయస్సుకు సంబంధించిన వివరాలను త్వరలో తెలియజేయనున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: త్వరలో తెలియజేయనున్నారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://secl-cil.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ జాబ్స్ కు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 543
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 9
విద్యార్హత: బీటెక్, బీఈ, డిప్లొమా
ALSO READ: Viral News: బ్రేకప్ అయ్యింది.. లీవ్ కావాలి.. సీఈవోకు ఉద్యోగి మెయిల్!