 
					Adivi Shesh :సాధారణంగా హీరోలు ఎక్కడైనా ఛాన్స్ దొరికిందంటే చాలు తమ సినిమా ప్రమోషన్స్ చేసుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రమోషనల్ కార్యక్రమాలు ఎక్కువగా పబ్లిక్ స్టంట్స్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక హీరో తన సినిమా ప్రమోషన్స్ కోసం ఏకంగా దేశాలు దాటేశారు అనే చెప్పాలి. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు తో ప్రమోషన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోస్తున్నారు. పైగా ట్రంప్ పోస్ట్ కి ఈయన తన సినిమా ప్రమోషన్స్ చేసుకోవడం సంచలనగా మారింది.మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం అడివి శేష్ డెకాయిట్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత గూఢచారి 2 సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అయితే తాజాగా ట్రంప్ చేసిన ఒక ట్విట్టర్ పోస్ట్.. దానికి అడివి శేష్ రిప్లై ఇచ్చిన విధానం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. “G2 త్వరలో సమావేశం అవుతుంది” అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ జే ట్రంప్ (Donald J Trump) తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు. వైట్ హౌస్ కూడా దీనిని ధ్రువీకరిస్తూ పోస్ట్ పెట్టింది. అయితే దీనిని తన సినిమా ప్రమోషన్స్ కోసం అడివి శేష్ వాడుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన G2 అలియాస్ గూఢచారి 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే ఈ విషయాన్ని అదునుగా చేసుకొని దానిని రీపోస్టు చేస్తూ.. “ట్రంప్ గారు మొదట డెకాయిట్ ఎక్స్ప్లోషన్.. ఆ తర్వాతే G2” అంటూ ఫన్నీ ఎమోజీలు షేర్ చేశారు. మొత్తానికైతే ఈ ట్విట్టర్ పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అడవి శేషు తెలివికి ఫిదా అవుతున్నారు. నువ్వు మామూలోడివి కాదు భయ్యో.. ఏకంగా ట్రంప్ వ్యాఖ్యలను మీ సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
also read:Bigg Boss 9 Promo: ఏంటమ్మా ఆడడానికి రాలేదా.. మాధురికి ఇమ్ము పనిష్మెంట్.. షేమ్ లెస్!
అడివి శేష్ డెకాయిట్ సినిమా విషయానికి వస్తే.. అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ మూవీ డెకాయిట్. కొత్త రిలీజ్ డేట్ రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే . 2026 ఉగాదిని పురస్కరించుకొని మార్చి 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. అంతేకాదు ఈయన నటిస్తున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాలో మొదట హీరోయిన్గా శృతిహాసన్ ఎంపికయింది. కానీ ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో.. ఆమె స్థానంలో ఇప్పుడు మృణాల్ ఠాగూర్ నటిస్తున్నారు.
Trump garu, First #DACOIT EXplosion
then #G2 MASSIVE 😬😬😬 https://t.co/WbNR3fYosJ— Adivi Sesh (@AdiviSesh) October 31, 2025