 
					The Paradise: న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నాని, శ్రీకాంత్ కాంబోలో వచ్చిన దసరా సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక దానికి మించి ది ప్యారడైజ్ ను తెరకెక్కిస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నాని లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
ఇక ఈ చిత్రంలో మోహన్ బాబ, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబు లుక్ రిలీజ్ అయ్యిది ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెల్సిందే. ఈ లుక్స్, స్టోరీ చూసాక ప్రేక్షకులు ఈ సినిమాపై మరింత హైప్ పెంచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి న్యాచురల్ స్టార్ గా నాని ఎదిగిన విధానం ఎంతోమందికి ఆదర్శప్రాయం. టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. అంచలంచలుగా ఎదుగుతూ వస్తున్నాడు. మంచి మంచి కథలను ఎంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నాడు నాని. పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న ఈ హీరో.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ రేంజ్ కు ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు.
ది ప్యారడైజ్ సినిమాలు కేవలం పాన్ ఇండియాలోనే కాకుండా పాన్ వరల్డ్ లో రిలీజ్ చేయడానికి నాని ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లోనే కాకుండా ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ఇంటర్నేషనల్ గా ఎదగాలని చూస్తున్న నాని.. ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపాడు.
హాలీవుడ్ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్ ను ది ప్యారడైజ్ లో భాగం చేసినట్లు సమాచారం. దాదాపు మూడు నెలలుగా ర్యాన్ ప్రతినిధులతో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారని, ఇటీవలే వారి చర్చలు ఫలించి ర్యాన్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఇది నిజమైతే ఈ సినిమాకు గ్లోబల్ గుర్తింపు వచ్చేసినట్లే. ఇక అన్ని భాషల్లో ఒక్కో నటుడిని దింపుతూ.. తన సినిమాను, తనను నెమ్మదిగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు నాని. మరి ఈ ప్రయత్నంలో న్యాచురల్ స్టార్ సక్సెస్ అవుతాడో.. లేదో చూడాలి.