BigTV English

BRS party – KCR: కేటీఆర్ ఫెయిల్.. బీఆర్ఎస్‌కు దిక్కెవరు? ఉద్యమకారులకు ప్రాధాన్యమేది?

BRS party – KCR: కేటీఆర్ ఫెయిల్.. బీఆర్ఎస్‌కు దిక్కెవరు? ఉద్యమకారులకు ప్రాధాన్యమేది?

ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఅర్ఎస్ క్యాడర్ ఇప్పుడు నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతుంది … జిల్లాలో బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు అయిదుగురు గెలిచిన ఎమ్మెల్యే లు ఉన్నా గులాబీ శ్రేణులని నడిపించే నాథుడే కరువవ్వడంతో స్థానిక‌ సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే అక్కడి నాయకులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది… పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోవడమే ఆ పరిస్థితికి కారణమంటున్నారు. మరి ఇప్పటికైనా కమిటీలు వేస్తారా? లేక అలాగే కాలం వెళ్ళదీస్తారా? అనేది బిఅర్ఎస్ క్యాడర్‌కి ప్రశ్నార్థకంగా మారింది.


తెలంగాణ ఉద్యమం లో కీలకపాత్ర పోషించి, రెండుసార్లు అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఅర్ఎస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై గులాబీబాస్ ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. పార్టీ మనుగడకు తన ఇమేజ్‌ సరిపోతుందన్నట్లు వన్ మాన్ షో చేస్తూ కాలం వెల్లబుచ్చారు. మొదటి నుంచి ఉద్యమ నేతలు ఆ పార్టీకి వెన్నెముకగా నిలిచారు. రాష్ట్రం తెచ్చారన్న గౌరవంతో ఆ పార్టీకి ఊడిగం చేశారు. అలాంటి నిజమైన ఉద్యమకారులకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇక్కవకుండా కేసీఆర్ పక్కన పెట్టేశారు.

ఆ ప్రభావం బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే స్పష్టంగా కనిపించింది. ఉద్యమం సమయం నుండి‌ పదేళ్లు అధికారంలో ఉన్నంత వరకు ఎదురు లేదన్నట్లు వ్యవహరించిన గులాబీపార్టీ పెద్దలకు వరుస షాక్‌లు తగలడం మొదలుపెట్టాయి. గద్దె దిగి ఏడాది కాకముందే బీఆర్ఎస్ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలలో ఐదుగురు ఎమ్మెల్యే లు గెలిచినా పార్లమెంటు ఎన్నికలలో ఘోర ఓటమి పాలై, మూడవస్థానానికి పరిమితం కావడం బీఆర్ఎస్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పార్టీ సెకండ్ కేడర్ అంతా కాంగ్రెస్, బీజేపీల వైపు జరుకుంటుంది.


ఉద్యమం సమయం నుంచి కారు పార్టీని నమ్ముకొని పార్టీ ఏ పిలుపు ఇచ్చినా ఉద్యమంలో పాల్గొని ఢక్కామొక్కీలు తిన్నవారే ఇప్పుడు ఆపార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు.. కేసీఆర్ పిలుపు మేరకి ఉద్యమం లో పాల్లొన్న వారిని కాదని … అధికారంలోకి వచ్చాక కొత్తగా పార్టీలో చేరినవారికే పదవులు ఇచ్చి ప్రోత్సహించడంతో ఇప్పుడు వారు కూడా పక్క చూపులు చూస్తున్నారు. బీఆర్ఎస్ అధికారం లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ల పెత్తనంతో ఏది చెపితే అది నడిచింది . కాని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి…ప్రభుత్వం లోపాలని ఎత్తిచూపుతూ ధర్నాలు చేయాలని పిలుపునిచ్చినా అక్కడక్కడా తప్ప ఎక్కడ కూడా బీఅర్ఎస్ క్యాడర్ యాక్టివ్‌గా పాల్గొనడం లేదు.

గత ఎన్నికల్లో కరీంనగర్, సిరిసిల్ల, కోరుట్ల, హుజురాబాద్, జగిత్యాలల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. తరువాత పరిమాణాలతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ ‌గూటికి చేరారు…. జగిత్యాల జిల్లాలో ఒకప్పుడు అన్నతానై వ్యవహరించిన ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంలో జైలుకి వెళ్ళడంతో జగిత్యాల జిల్లాలో బీఅర్ఎస్ క్యాడర్ పూర్తిగా చెల్లాదురైంది . సిరిసిల్ల లో బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే గా ఉన్నా కూడా అక్కడి పార్టీ ‌క్యాడర్ మునుపటిలా యాక్టివ్ గా‌ లేరు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఎక్కువ సమయం హైదరాబాదులో గడపుతుండటంతో అక్కడ గులాబీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.

ఇక మాజీ మంత్రి ‌గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లో ఇప్పటికే చాల మంది కార్పొరేటర్లు కారు దిగేశారు. ఉన్న కార్పోరేటర్లు కూడా చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు లాండ్ ఖబ్జాలు, భూ సెటిల్మెంట్ చేసారని జైలుకి వెళ్ళి వచ్చారు. కరీంనగర్ బీఆర్ఎస్‌లో మిగిలిన కార్పొరేటర్లకి అండగా నిలిచే వారు కరువు అయ్యారు.

ఇక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం సమయంలో పనిచేసిన వారు ఒకసారి కాకపోతే మరొకసారి అవకాశం వస్తుందని పనిచేసారు..కాని తమని అధిష్టానం గుర్తించకపోవడంతో ఇప్పుడు తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీ కమిటీలో పదవులు వస్తాయని అధినేత దృష్టిలో పడాలని ఎదురు చూసిన వారంతా గత పదేళ్లలో అసలు కమిటీల ఊసే ఎత్తక పోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. యాక్టివ్ పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని భావించినా ఆ దిశగా చర్యలు చేబట్టలేదని, పార్టీ మారి వచ్చిన నెతలకే పెద్దపీట వేసారని. వారు కనీసం తమని పట్టించుకోలేదని ఇప్పుడు పార్టీ ఓటమి తరువాత వారంతా కనబడకుండా పోయారని అనుకుంటున్నారు. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అధిష్టానం ఏం చేస్తుందని,ఏడాది నుండి బిఅర్ఎస్ క్యాడర్ లో కనీసం ఉత్సాహాన్ని నింపేవారే లేరని,అధికారం లో‌ ఉన్నప్పుడు పార్టీ సభ్యత్వాలపై దృష్టి పెట్టిన ఇప్పుడు సభ్యత్వాలూ లేవు, కమిటీలు లేవు….కనీసం తమకి బాధ లు చెప్పుకుందామంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని క్యాడర్ నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

Also Read: సురేష్ మా పార్టీ కార్య‌క‌ర్తే.. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

వరుస ఓటములతో కుంగిపోతున్న కేడర్‌ని తిరిగి యాక్టివ్ చేయడానికి కేసీఆర్ అందుబాటులో లేకుండా పోయారు. ఇటు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాల్లో కేటీఆర్ ప్రభావం చూపించలేకపోతున్నారని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన కనీసం క్యాడర్‌కి దిశా నిర్దేశం చేసే స్థితిలో లేరని క్యాడర్ స్వయంగా ఎత్తిపొడుస్తుంది … గ్రామస్థాయి నుంచి జిల్లాల వరకు పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి … స్థానిక నేతలకు బాధ్యతలు అప్పగిస్తే వారైనా కనీసం పార్టీ శ్రేణులను యాక్టివ్ చేస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. లేకపోతే స్థానిక‌సంస్థల ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపి, పోటీ చేయాలంటేనే బీఆర్ఎస్ నేతలు భయపడే పరిస్థితి తలెత్తుతుందని గులాబీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. మరి బీఅర్ఎస్ అధిష్టానం యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×