BigTV English
Advertisement

Pradeep Ranganathan : ‘డ్యూడ్’ హిట్టు.. రెమ్యూనరేషన్‌ పెంచేశాడు.. ఆ హీరోల కంటే ఎక్కువే..

Pradeep Ranganathan : ‘డ్యూడ్’ హిట్టు.. రెమ్యూనరేషన్‌ పెంచేశాడు.. ఆ హీరోల కంటే ఎక్కువే..

Pradeep Ranganathan : కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ పేరు ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల లో వినిపిస్తుంది. ఒకప్పుడు డైరెక్టర్గా సినిమాలను తెరకెక్కించిన ఈయన ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను తన అకౌంట్లో వేసుకుంటున్నాడు.. ఇప్పటివరకు మూడు సినిమాల్లో హీరోగా నటించాడు.. ఆ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా వచ్చిన న్యూడ్ మూవీ పాజిటివ్ టాక్ తో పాటు 100 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఈయన సినిమాలు ఒక్కొక్కటి హిట్ అవ్వడంతో రెమ్యూనరేషన్ పెంచినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ ఒక్కో సినిమాకి ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసుకుందాం..


రెమ్యూనరేషన్ పెంచేసిన ప్రదీప్ రంగనాథన్.. 

సినీ ఇండస్ట్రీలో ఒక హీరోకి సినిమాలు హిట్ అయితే అతని క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇక ఎక్కువ మంది జనాలు ఆయనకు ఫ్యాన్స్ అయిపోతారు. మార్కెట్లో హీరో డిమాండు అమాంతం పెరిగిపోతుంది. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి హీరోలు మార్కెట్లో తమ రేటుని పెంచేస్తుంటారు. నెక్స్ట్ చేయబోయే సినిమాలకు రెమ్యూనరేషన్ పెంచేసి నిర్మాతలకు షాకిస్తారు. ఈ కుర్ర హీరో కూడా రేటు పెంచినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ఇప్పటివరకు ఆయన 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకొనేవాడట.. ఇక మీదట 25 కోట్లు తీసుకోబోతున్నాడని టాక్.. ఈ హీరో నటించిన సినిమాలకు బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుంది. ఇక నిర్మాతలు కూడా అతని మార్కెట్ ను బట్టి అతని అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Also Read : హాలీవుడ్ డైరెక్టర్‌గా తెలంగాణ యువకుడు.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే ?


హీరో నాని కన్నా ఎక్కువే.. 

డైరెక్టర్ టు హీరో గా సక్సెస్ అవుతున్న ప్రదీప్ రంగనాథన్ కు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. వరుసగా హిట్ సినిమాలు పడటంతో ఈ హీరోతో సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఆయనకు మార్కెట్ క్రేజ్ తో డిమాండ్ ఎక్కువే. తన పేరు మీద 130 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఇంత బిజినెస్ జరుగుతున్నప్పుడు 25 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేయడం లో న్యాయం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.. ఇక టాలీవుడ్ లో నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో ఉన్నారు. వీళ్ళు కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం లేదు. నిన్నగాక మొన్న హీరోగా మారినా ప్రదీప్ రంగనాథన్ మార్కెట్లో క్రేజ్ ని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. ఇలాగే వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యాయి ఈ హీరో ఏ రేంజ్ కు వెళ్తాడో చూడాలి.. ప్రస్తుతం ఈ తమిళ హీరో వరుసగా సినిమాలను లైనప్ పెట్టుకుంటున్నాడు. త్వరలోనే ఓ రెండు ప్రాజెక్టుల ను అనౌన్స్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.

Related News

Manchu Lakshmi: సర్వనాశనం అవుతారు.. శాపనార్థాలు పెట్టిన మంచు లక్ష్మి.. ఏమైందంటే?

Jailer 2: జైలర్ 2 నుంచి తప్పుకున్న బాలయ్య.. రంగంలోకి మరొక స్టార్ హీరో?

Ram pothineni: డెబ్యూ డైరెక్టర్ తో రామ్ పోతినేని.. జనవరి నుంచి షూటింగ్ మొదలు!

The Girl Friend Censor Review : రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సెన్సార్ రివ్యూ… ఏకంగా జాతీయ అవార్డే

Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్  ఫైర్ అవుతున్న ఆ హీరో ఫ్యాన్స్.. ఏమైందంటే?

Hyper Aadi: హైపర్‌ ఆది చంపేస్తానంటూ బాలయ్య వార్నింగ్‌.. అసలేం జరిగిందంటే!

Prasanth Varma : డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మకు కోట్ల రూపాయల అడ్వాన్స్… ఫైనల్‌గా ఓపెన్ అయిన నిర్మాత

Salman Khan: దిల్ రాజుతో డీల్ కుదుర్చుకున్న సల్మాన్ ఖాన్..ఆ డైరెక్టర్ తో కొత్త సినిమా?

Big Stories

×