Indian Army Jobs: దేశ సేవ చేయాలనుకునే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారత సైన్యం ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) టెక్నికల్ విభాగంలో 379 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అవివాహిత పురుషులు, మహిళలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన వివరాలు:
పోస్టుల సంఖ్య: మొత్తం 379 పోస్టులు. ఇందులో పురుషులకు 350, మహిళలకు 29 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. భారత సాయుధ బలగాల విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది భార్యలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ. 56,100 స్టైఫెండ్ లభిస్తుంది. శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. అప్పుడు నెలవారీ జీతం సుమారు రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది.
షార్ట్ లిస్టింగ్: అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు.
ఎస్.ఎస్.బి. ఇంటర్వ్యూ: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూ ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఇందులో స్క్రీనింగ్, సైకలాజికల్ అసెస్‌మెంట్, గ్రూప్ టాస్క్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటాయి.
మెడికల్ టెస్ట్: ఎస్.ఎస్.బి. ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో శిక్షణ ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ అయిన joinindianarmy.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.