E-Paper
Advertisement

Telangana Inter: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఫస్టియిర్ వాళ్లే ఎక్కువ

Telangana Inter: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఫస్టియిర్ వాళ్లే ఎక్కువ
Advertisement

Inter Advanced Supplementary Results: ఎట్టకేలకు తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు టెన్షన్ పోయింది. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుల చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. ఈ ఫలితాలను ఆన్‌లైన్‌లో వెల్లడించారు అధికారులు.

తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు

Advertisement

జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ఫలితాలను ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 3,98,498 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు, మార్కుల శాతం పెంచుకోవాలన్న విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 2,67,331 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 1,84,042 మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 68.84 శాతంగా ఉంది. సెకండియర్ పరీక్షలకు 1,31,128 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Advertisement

సెకండియర్ విద్యార్థుల కంటే ఫస్టియర్ వాళ్లే ఎక్కువమంది

అందులో 64 వేల మంది పైచిలుకు విద్యార్థులు పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం కేవలం 49.29గా నమోదైంది. సెకండియర్ విద్యార్థుల కంటే ఫస్టియర్ వాళ్లే ఎక్కువమంది ఉన్నారు. మే 13 నుంచి 21 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా 889 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.

మొత్తం 17 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలలో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసింది బోర్డు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి స్కోర్ కార్డును డౌన్‌ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. tgbie.cgg.gov.in, results.cgg.gov.in అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మార్క్స్ మెమోను విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. ఉన్నత విద్య ప్రవేశాల కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ విడుదల కావడంతో విద్యార్థులు కాసింత టెన్షన్ పడ్డారు. దీంతో ఇంటర్ బోర్డు మూల్యాంకనం వేగంగా ఫలితాలను విడుదల చేయడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

ALSO READ: టీజీ ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌.. మూడు విడతల్లో, ఎప్పటి నుంచి అంటే

విద్యార్థులు ఫలితాలను ఎలా తెలుసుకోవాలంటే.. తొలుత ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోమ్‌ పేజీలో కనిపించే Inter Advanced Supplementary Results లింక్‌పై తొలుత క్లిక్ చేయాలి. జనరల్ లేదా ఒకేషనల్ కోర్సును ఎంపిక చేసుకుని ఫస్ట్ ఇయర్ లేకుంటే సెకండ్ ఇయర్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి బటన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది, దాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×