E-Paper
Advertisement

TG EAPCET Counselling: టీజీ ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌.. మూడు విడతల్లో, ఎప్పటి నుంచి అంటే

TG EAPCET Counselling: టీజీ ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌.. మూడు విడతల్లో, ఎప్పటి నుంచి అంటే
Advertisement

TG EAPCET Counselling: ఎట్టకేలకు తెలంగాణలో ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదలైంది. మూడు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల అంటే జూన్ 19 నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్ నమోదు ప్రక్రియ మొదలుకానుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు వ్యవహారం జరగనుంది.

టీజీ ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ వచ్చిసిందోచ్

Advertisement

జూన్ 22 నుంచి 29 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. ఆ తర్వాత జూన్ 25 నుంచి జూలై ఒకటి వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జరగనుంది. జూలై 4న మాక్ సీట్ అలాట్‌ జరగనుంది. జూలై 5 నుంచి 7 వరకు ఆప్షన్ల మార్పుకు అవకాశం ఉంటుంది. జూలై 10న తొలి దశ సీట్ల కేటాయింపు జరగనుంది. ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ వంటి అంశాలు జూలై 10 నుంచి 14 వరకు ఉండనున్నాయి.

ఇక రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విషయానికి వద్దాం. జులై 17 నుంచి సెకండ్ ఫేజ్ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. అదే రోజు స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం మొదలుకానుంది. మరుసటి రోజు అంటే జులై 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరగనుంది. జులై 18-19 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు మొదలుకానుంది.

Advertisement

మూడు విడతల్లో కౌన్సెలింగ్ మొదలు.. జూన్ 19 నుంచి ప్రక్రియ మొదలు

సీట్లు దక్కించుకున్న అభ్యర్థులు జులై 25 నుంచి 28 లోపు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సివుంటుంది. ఇక సీటు రద్దు చేసుకోవాలనుకునే వారికి జులై 28 వరకు అవకాశం ఉండనుంది. ఇక చివరి మూడో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ జులై 31 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. అదే రోజు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది.

ఆగస్టు ఒకటి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. ఆగస్టు 5న సీట్ల కేటాయింపు కాగా, ఆగస్టు 5 నుంచి 7లోపు వెబ్‌సైట్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. ఇక బ్రాంచ్‌ మారాలనుకొనేవారికి ఆగస్టు 12, 13న వెబ్‌ ఆప్షన్ కేటాయిస్తారు. ఆగస్టు 15న సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మధ్య, దిగువ తరగతి విద్యార్థుల రెసిడెన్సీ, కమ్యూనిటీ, ఆదాయ సర్టిఫికెట్లు రెడీ చేసుకోవాల్సి వుంటుంది.

ALSO READ: నీట్ రీఎగ్జామ్.. రహస్య ప్రాంతంలో పేపర్ తయారీ నిఫుణులు, జూన్ 21 వరకు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×