IOCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOCL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు, ఇంటర్, డిప్లొమా పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 3న దరఖాస్తు గడువు ముగియనుంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆసక్తి కలిగన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం పోస్టుల వెకెన్సీ సంఖ్య: 457
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రెంటీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇందులో పలు రకాల ట్రేడ్ లల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. టెక్నిషియన్ అప్రెంటీస్(మెకానికల్), టెక్నీషియన్ అప్రెంటీస్(ఎలక్ట్రికల్), టెక్నీషియన్ అప్రెంటీస్ (టెలీ కమ్యూనికేషన్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్), ట్రేడ్ అప్రెంటీస్ (అకౌంటంట్), ట్రేడ్ అప్రెంటీస్ (అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్), ట్రెడ్ అప్రెంటీస్ (అకౌంటంట్), డేటా ఎంట్రీ ఆపరేటర్(ఫ్రెషర్ అప్రెంటీస్), డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్(స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్) విభాగాల్లో వెకెన్సీ ఉన్నాయి. పోస్టును బట్టి విద్యార్హత ఉంది.
కేటగిర్ల వారీగా ఉద్యోగాలు చూసినట్లయితే..
జనరల్: 264 ఉద్యోగాలు
ఈడబ్ల్యూఎస్: 32 ఉద్యోగాలు
ఓబీసీ: 84 ఉద్యోగాలు
ఎస్సీ : 52 ఉద్యోగాలు
ఎస్టీ: 25 ఉద్యోగాలు
దివ్యాంగ అభ్యర్థులు: 12 ఉద్యోగాలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 10
దరఖాస్తుకు లాస్ట్ డేట్: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ 2025 మార్చి 3 లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
వయో పరిమితి: కనిష్ట వయస్సు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 24 ఏళ్ల దాటరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఆయా కేటగిర్ల వారీగా వయస్సు సడలింపు ఉంటుంది. 2025 ఫిబ్రవరి 28 నాటికి 24 ఏళ్ల వయస్సు మించి ఉండరాదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: ఇంటర్, డిప్లొమా, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో 12 నెలల అప్రెంటీస్ షిప్ ఉంటుంది. పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఉంటుంది.
పోస్ట్ ఎంపిక విధానం: ఇంటర్, డిప్లొమా, డిగ్రీలో వచ్చిన మెరిట్ ఆధరాంగా పోస్టుకు సెలెక్ట్ చేస్తారు. ఒక వేళ మెరిట్ స్కోర్ లో ఇద్దరు అభ్యర్థులకు ఒకే రకమైన మార్కులు వస్తే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. వయస్సు లో ఎవరు పెద్దవారు అయితే వారికే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది.
పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://iocl.com/
అర్హత ఉన్న అభ్యర్థులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లోని అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. పోస్టుకు అర్హత సాధించండి. ఆల్ ది బెస్ట్.