BigTV English

Junior Executive Jobs: ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాలు.. ఏడాదికి రూ.13,00,000 జీతం భయ్యా.. పూర్తి వివరాలు ఇదిగో..

Junior Executive Jobs: ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాలు.. ఏడాదికి రూ.13,00,000 జీతం భయ్యా.. పూర్తి వివరాలు ఇదిగో..

Junior Executive Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులందరికీ ఇది గుడ్ న్యూస్. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఇవ్వనున్నారు.


నిరుద్యోగులకు ఇదే మంచి అవకాశం. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 18తో దరఖాస్తు గడువు ముగియనుంది. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, PET, PMT, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 83


ఇందులో 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలున్నాయి.

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI నుండి విడుదలయిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తులు చేసుకోగలరు.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 17

దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 18 (మార్చి 18లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.)

వయస్సు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు సడలింపు  ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

విద్యార్హత:  AAI నుండి ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి మెకానికల్, ఆటో మొబైల్, ఫైర్ విభాగాల్లో ఇంజినీరింగ్ పాసై ఉండాలి.

జూనియర్ ఎగ్జిక్యూటివ్(హ్యుమన్ రిసోర్సెస్) ఉద్యోగానికి డిగ్రీ, ఎంబీఏ లేదా పీజీలో హెచ్ఆర్ఎం, హెచ్ఆర్‌డీ, పీఎం అండ్ ఐఆర్, లేబర్ వెల్ఫేర్ కోర్సు చేసి ఉండాలి.

జూనియర్ ఎగ్జిక్యూటివ్(అఫీషియల్ లాంగ్వేజ్) ఉద్యోగానికి పోస్ట్ గ్యాడ్యుయేషన్‌లో హిందీ లేదా ఇంగ్లిష్ ఉండాలి.

ఉద్యోగ ఎంపిక విధానం:  ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత Pet, pmt, మెడకల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా షార్ట్ లిస్ట్ అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

జీతం: ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹1,00,000/- జీతం ఉంటుంది. సంవత్సరానికి ₹13లక్షల జీతం చెల్లిస్తారు . అలాగే TA, DA, HRA వంటి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ్ అభ్యర్థులు, మహిళ అభ్యర్థు ఫీజు మినహాయింపు ఉంది.

దరఖాస్తుకు కావాల్సిన సర్టిఫికెట్స్: దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి.  10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి. స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉంటే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: AAI సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోని దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.aai.aero/

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×