BigTV English

Viswambhara Updates : 600 మంది డ్యాన్సర్స్ తో చిరు స్టెప్పులు .. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదు..

Viswambhara Updates : 600 మంది డ్యాన్సర్స్ తో చిరు స్టెప్పులు .. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదు..

Viswambhara Updates : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేస్తామని ముందుగా ప్రకటించినా కూడా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో ఈ మూవీని మే నెలకు వాయిదా వేశారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోనే జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


మెగాస్టార్ విశ్వంభరా మూవీని మే 9న రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాను త్వరగా పూర్తిచేసి ప్రమోషన్స్ లో బిజీ అవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీలోని ఓ సాంగ్ ని హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారని తెలుస్తుంది.. రేపు కోకాపేటలో సాంగ్ కోసం ఏర్పాటు చేసిన భారీ సెట్ లో 600 మంది డ్యాన్సర్స్ తో చిరంజీవి స్టెప్పులు వెయ్యనున్నారని తెలుస్తుంది. ఆ పాటకు శోభా మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారని సమాచారం.. ఈ సాంగ్ తర్వాత మళ్లీ షూటింగ్ ను పూర్తి చెయ్యనున్నారని టాక్..

ఇక ఈ మూవీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీకి ఇదే హైలైట్‍గా ఉండనుందని సినీ వర్గాల్లో టాక్. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 26 రోజుల పాటు షూటింగ్ జరిగింది. భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 54 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని మూవీ టీమ్ ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం ముందే ఇంట్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరిగింది. ఇంటర్వెల్ కోసమే 26 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి ఫైట్స్ చూసేందుకు రెండు కళ్లు చాలవట..


ఇకపోతే సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా భారీ వీఎఫ్‍ఎక్స్‌తో విశ్వంభర చిత్రం ఉండనుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్‍లో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.. ఈ మూవీ వీఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. చిరంజీవి గతంలో చెయ్యని విధంగా ఈ సినిమా స్టోరీ ఉండబోతుంది. చిరంజీవి లుక్ కూడా డిఫరెంట్ గా ఉందని ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ ను చూస్తే తెలుస్తుంది. విశ్వంభర చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్‍గా త్రిష చేస్తున్నారు. సుమారు 18 సంవత్సరాల తర్వాత చిరూ, త్రిష కలిసి నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయని తెలుస్తోంది. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో ఐదు భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.. మొత్తానికి అయితే ఈ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని చిరంజీవి కసిగా ఉన్నాడు. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×