APCOB Bank Recruitment: ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(APCOB) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ దరఖాస్తుకు ఇంకా వారం రోజులే గడువు ఉంది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(APCOB) రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, విజయవాడ, శ్రీకాకుళం, కర్నూల్ జిల్లాలో డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల్లో(DCCB) ఖాళీగా ఉన్న స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 251
ఇందులో రెండు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ 50, స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ ఉద్యోగాలు 201 వేకన్సీ ఉన్నాయి.
అసిస్టెంట్ మేనేజర్ – 50
స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు: 201
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, 55 శాతం మార్కులతో పీజీ పాసై ఉంటే సరిపోతుంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో చదవడం, రాయడం రావాలి. కంప్యూటర్ అవగాహన కూడా ఉండాలి.
వయస్సు: 2024 అక్టోబర్ 31 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
జీతం: నెలకు రూ.26000 నుంచి రూ.57,860 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.700 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.500 ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 22
అఫీషియల్ వెబ్ సైట్: http://https//apcob.org
Also Read: JOBS: నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. త్వరలో 26,263 ఉద్యోగాలకు నోటిఫికేషన్..
అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగం వస్తే మంచి వేతనం లభిస్తుంది. ఇప్పుడే ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోండి. ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.