Best European Sleeper Trains: విమాన ప్రయాణంతో పోల్చితే రైలు ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి అందాలు చూస్తూ జర్నీ చెయ్యొచ్చు. నదులు, లోయలు, పచ్చిక బయళ్లు, మంచు కొండలు చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు. భారత్ లో పోల్చితే.. యూరప్ లో ఆహ్లాదకరమైన స్లీపర్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. జీవితంలో కనీసం ఒక్కసారైన వీటిలో ప్రయాణం చేయాల్సిందే అంటారు టూరిస్టులు. ఇంతకీ యూరప్ లోని బెస్ట్ స్లీపర్ రైళ్లు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿బ్రస్సెల్స్- ప్రేగ్ స్లీపర్ రైలు
ఈ యూరోపినయ్ స్లీపర్ రైలు బ్రస్సెల్స్ నుంచి ప్రేగ్ వరకు నాలుగు రాజధానులను కలుపుతూ ముందుకుసాగుతుంది. బ్రస్సెల్స్ నలో మొదలయ్యే ఈ ప్రయాణం బెర్లిన్ వరకు కొనసాగుతుంది. ఈ రైలు అద్భతమైన లోయల గుండా వెళ్తున్నది. అద్భుతమైన ప్రకృతి రమణీయతను చూసి పర్యాటకులు ఎంజాయ్ చేస్తారు.
⦿వియన్నా-హాంబర్గ్ స్లీపర్ రైలు
ఈ రైలు వియన్నా నుంచి హాంబర్డ్ నడుమ తన సేవలను కొనసాగిస్తున్నది. మొత్తం 12 గంటల పాటు కొనసాగే ఈ జర్నీ జర్మనీ మీదుగా వెళ్తుంది. హిప్ పోర్ట్ సిటీతో పాటు రోలింగ్ ఫీల్డ్స్ గుండా ప్రయాణిస్తుంది. దారి అంతా అద్భుతమైన అందాలు దర్శనం ఇస్తాయి.
⦿లండన్-వేల్స్ స్లీపర్ జర్నీ
బ్రిటన్ లోని విలాసవంతమైన స్లీపర్ రైళ్లలో ఇది ఒకటి. త్వరలో అందుబాటులోకి రానుంది. యుకెలో ఇప్పటి వరకు ఇలాంటి రైలు లేదు. అత్యాధునిక వసతులతో లగ్జరీ ప్రయాణాన్ని అందించనుంది. విలాసవంతమైన ఇంటీరియర్, చక్కటి భోజనం ఇందులో లభించనుంది. ఈ రైలు కార్న్ వాల్, వేల్స్ పర్వతాలు, లేక్ డిస్ట్రిక్ట్ లాంటి పర్యాటక ప్రాంతాల మీదుగా జర్నీ కొనసాగించనుంది.
⦿రోమ్- వియన్నా స్లీపర్
యూరప్ లోని అద్భుతమైన స్లీపర్ రైళ్లలో ఇది ఒకటి. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. ఆల్ప్స్ పర్వతాలు, నదులను, ఆస్ట్రియన్ రాజధాని, వియన్నా అందాలు ఆకట్టుకుంటాయి. ఆస్ట్రియన్ గ్రామీణ ప్రాంతాల అందాలు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ రైళ్లలో ప్రయాణీకులను చక్కటి వైఫై సౌకర్యం కూడా లభిస్తుంది.
⦿బ్రస్సెల్స్- ఆల్ప్స్ స్లీపర్ రైలు
ఈ రైలు ఈ ఏడాది మార్చిలో అందుబాటులోకి రానుంది. లండన్ సెయింట్ పాన్ క్రాస్ నుంచి ఫ్రాన్స్ లోని బోర్గ్-సెయింట్-మారిస్ వరకు పూర్తిగా పునరుద్ధరించబడిన యూరోస్టార్ స్నో రైలు మళ్లీ అందుబాటులోకి రానుంది. ఈ ప్రయాణం కూడా పర్యాటకులకు అద్భుతమైన ఆహ్లాదాన్ని అందిస్తున్నది.
⦿రోమ్- పలెర్మో స్లీపర్ జర్నీ
ఇటలీలోని విలాసవంతమైన స్లీపర్ రైళ్లలో ఇది ఒకటి. ఇటలీ చుట్టూ తిరిగే ఈ రైలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఏప్రిల్ 2025 నుంచి కొత్త మార్గాల్లో ఈ రైలు జర్నీ చేయనుంది. ఇటలీ దక్షిణ ప్రయాణంలో భాగంగా మెస్సినా జలసంధి అద్భుతంగా ఆకట్టకుంటుంది. పిక్చర్ పోస్ట్ కార్డ్ టోర్మినా, రియు పలెర్మో లాంటి ప్రదేశాల్లో హాల్టింగ్ తీసుకుంటుంది. పర్యాటకులను చక్కటి అనుభూతిని అందిస్తుంది.
Read Also: టూరిస్టులకు గుడ్ న్యూస్, ఇక ఆ రూట్ లో విస్టాడోమ్ రైలు వచ్చేస్తోంది!