BigTV English
Advertisement

JOBS: నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. త్వరలో 26,263 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

JOBS: నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. త్వరలో 26,263 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

JOBS: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాల పరిధిలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు నింపే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. త్వరలోనే భారీ నోటిఫికేషన్ రానుంది. వైద్యులు, పారామెడికల్ విభాగాల్లో ఉద్యోగాలు 25 శాతానికి పైగా వెకెన్సీ ఉన్నాయి.


డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(డీఎన్‌హెచ్), డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీహెచ్), ఆయుష్, జాతీయ ఆరోగ్య మిషన్‌లలో ఉద్యోగ వేకన్సీ వివరాలను వైద్య ఆరోగ్య శాఖ సేకరించింది. ఆ ఉద్యోగాల ఖాళీల వివరాలను కూడా వెల్లడించింది. నిర్ణీత 1,02,125 ఉద్యోగాలలో 3,114 వైద్యులు, 23,149 పారామెడికల్ ఉద్యోగులు లేరని తెలిపింది.

అయితే.. ముందుగా వీటిలో అవసరం దృష్ట్యా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాధాన్య క్రమంలో ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఆలోచనలో ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో అంతర్భాగంగా ఉన్న ఆయుష్ కింద ఆయుర్వేద, హోమియో, యునాని ఆస్పత్రులు సేవలదిస్తున్నాయి. ఆయుష్ విభాగంలో మొత్తం 825 పోస్టులకు గానూ 407 ఖాళీలున్నాయి. కాంపౌండర్లు, అటెండర్లు, ఇతర పోస్టులన్నీ కలిపి 1601 పోస్టులు మంజూరు కాగా 1131 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.


బోధనాస్పత్రుల్లో 5749 వైద్యుల పోస్టుల మంజూరు కాగా 1484 ఖాళీగా ఉన్నాయి. విజయ వాడ జీజీహెచ్‌లో 314 వైద్య పోస్టులకు గానూ 46 వెకెన్సీ ఉన్నాయి. మెడికల్, సర్జికల్ ఆంకాలజీ విభాగాలల్లో నాలుగు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

గుంటూరు జీజీహెచ్‌లో 65 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్లీనికల్ డిపార్టుమెంట్ లో 14, నాన్ క్లినికల్ 19, సూపర్ స్పెషాలిటీలో 38 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఈ మూడు డిపార్టుమెంట్లలో కలిపి ప్రొఫెసర్ 17, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 10 చొప్పున ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా 78 రెసిడెంట్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. పీహెచ్‌సీలు, జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆస్పత్రుల్లో కలిపి 708 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో 9,978 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ, నర్సులు ఇతర ఉద్యోగాలున్నాయి. ఐసీయూల్లో నర్సుల ఉద్యోగాలు వెకన్సీ ఉన్నాయి.

Also Read: Formula E Race Case: ప్రతి పైసాకు నా దగ్గర లెక్కుంది.. KTR సంచలన వ్యాఖ్యలు..

అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఏడు నుంచి ఎనిమిది వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తర్వాత మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. త్వరలోని ఏడు నుంచి ఎనిమిది వేల ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం పొందాలని అనుకునే వారికి ఇదే గుడ్ న్యూస్. ఇప్పటి నుంచి అర్హత ఉన్న అభ్యర్థులు ప్రిపరేషన్ మొదలు పెట్టంది. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్.

Related News

IRCTC Recruitment 2025: IRCTCలో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు, ఆ డిగ్రీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి!

NABARD Notification: నిరుద్యోగులకు శుభవార్త.. నాబార్డులో ఆఫీసర్స్ ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు

BEML Notification: భారత్ ఎర్త్ మూవర్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.40000.. ఇంకెందుకు ఆలస్యం

NSUT Notification: నేతాజీ సుభాష్ యూనివర్సిటీలో 184 ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా జీతం, పూర్తి వివరాలివే..

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

Big Stories

×