IGI Aviation Services: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. టెన్త్ క్లాస్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు – వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫీజు గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నోట్: రెండు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుంది..
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 21
మొత్తం వెకెన్సీల సంఖ్య: 1446
ఇందులో ఎయిర్ పోర్టు గ్రౌండ్ స్టాఫ్, లోడర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వివరాలు:
ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్: 1017 పోస్టులు
లోడర్ (మెన్స్ ఓన్లీ) : 429 పోస్టులు
విద్యార్హత: టెన్త్, ఇంటర్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవియేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఐటీఐ పాసైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లోడర్ ఉద్యోగానికి అయితే టెన్త్ పాసైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లోడర్ ఉద్యోగానికి పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగానికి పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: ఎయిర్ పోర్టు గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగానికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. లోడర్ ఉద్యోగానికి 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు లేదు.
వేతనం: ఎయిర్ పోర్టు గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగానికి రూ.25వేల నుంచి రూ.35వేల వరకు జీతం ఉంటుంది. లోడర్ ఉద్యోగానికి రూ.15వేల నుంచి రూ.25వేల వరకు జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా సెలెక్ట్ చేస్తారు. రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. అదే లోడర్ ఉద్యోగానికి అయితే రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్ష 70 శాతం, ఇంటర్వ్యూ 30 శాతం ఆధారంగా ఉంటుంది.
ఉద్యోగానికి ఎంపికైన వారికి మెడికల్ టెస్ట్, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
దరఖాస్తు విధానం: అర్హత ఉన్న వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సరైన వివరాలు, ఫోటో అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగానికి రూ.350 ఫీజు ఉంటుంది. లోడర్ ఉద్యోగానికి అయితే రూ.250 ఫీజు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 21
ఎగ్జామ్ సెంటర్స్: దేశంలో ముఖ్య నగరాల్లో ఉంటుంది. హైదరాబాద్ లో కూడా ఉంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: http://https//igiaviationdelhi.com/
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1446
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 21