BigTV English
Advertisement

Telangana Police Jobs: నిరుద్యోగులకు బిగ్ గుడ్‌న్యూస్.. 12,452 పోలీస్ ఉద్యోగ వెకెన్సీలు.. ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్

Telangana Police Jobs: నిరుద్యోగులకు బిగ్ గుడ్‌న్యూస్.. 12,452 పోలీస్ ఉద్యోగ వెకెన్సీలు.. ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్

⦿ రాష్ట్రంలో 12,452 పోలీస్ ఉద్యోగ వెకెన్సీలు…


⦿ అత్యధికంగా 8442 సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు..

⦿ ఆ తర్వాత 3271 ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు..


⦿ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు 739 వెకెన్సీలు..

Telangana Police Jobs: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది మెగా భారీ గుడ్ న్యూస్.. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకానుంది. ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం పోకస్ పెట్టింది. ఏయే శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఖాళీల వివరాల నివేదకను సమర్పించింది.

⦿ సివిల్ విభాగంలో అత్యధిక పోస్టులు

మొత్తం పోలీస్ శాఖలో 12,452 పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ఇందులో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానంలో మంజూరైన పోస్టుల వివరాల సంఖ్య తెలిపింది. ఇందులో అత్యధికంగా సివల్ పోలీస్ కానిస్టేబుల్ కేటగిరిలో 8442 పోస్టులు ఉన్నాయి. ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ కేటగిరిలో 3271 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్ఐ) సివిల్‌ కేటగిరీలో 677, ఏఆర్‌ కేటగిరీలో 40, టీజీఎస్పీ (TGSP) కేటగిరీలో 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ పంపిన నివేదికలో పోలీస్ శాఖ తెలిపింది.

⦿ అన్ని శాఖల నుంచి సమాచారం కోరిన ఆర్థిక శాఖ

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అన్ని శాఖల్లో ఎన్ని పోస్టులు వెకెన్సీలు ఉన్నాయో పంపాలని ఆర్థిక శాఖ తెలిపింది. అన్ని శాఖల్లో కేడర్‌ ల వారీగా మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలు, డిప్యూటేషన్, లాంగ్ లీవ్ లో ఉన్న ఉద్యోగులు, ఇలా వివిధ కోణాల్లో క్లియర్ కట్ వివరాలపై ప్రత్యేకంగా మాజీ సీఎస్ శాంతి కుమారి నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కమిటీలు ఏ యే శాఖల్లో ఎన్ని వెకెన్సీలు ఉన్నాయని సమీక్షలు నిర్వహిస్తోంది. ఏ యే శాఖలో పని భారం ఎక్కువగా పడుతోంది.. ఆ శాఖలో వివరాలు.. ఒక వేళ పని భారం తక్కువగా ఉంటే ఎన్ని పోస్టులు భర్తీ చేయాలి.. అనే అంశాలను లెక్కలోకి తీసుకుని నిశితంగా పరిశీలన చేస్తోంది.

⦿ అన్ని శాఖలకు ఆర్థిక శాఖ సర్క్యులర్

దీనికి సంబంధించిన వివరాలను ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖల్లో క్లియర్ కట్ సమాచారాన్ని కమిటీకి అందజేయాలని ఆదేశాలు జారీ చేస్తూ.. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా స్పెషల్ సర్క్యులర్ పంపారు. ఈ సమీక్షలు అన్ని కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అనంతరం జాబ్ క్యాలెండర్ రూపకల్పన జరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఫటా ఫట్ కొలువుల భర్తీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయనున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖలో వెకెన్సీ సమాచారం తెలిసిపోగా.. మిగిలిన శాఖలలోని సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Dussehra Holidays: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు, ఎప్పటి వరకు అంటే..?

⦿ ఫటాఫట్.. ధనాధన్..

అన్ని వెకెన్సీల వివరాల తెలిసిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్-1, గ్రూప్-2, టీచర్, గ్రూప్-4 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. మీరు ఉద్యోగం సాధించాలంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెడితే ఉద్యోగం సాధించండి సులభం అవుతోంది. ఎగ్జామ్ టైం వరకు మూడు, నాలుగు సార్లు రివిజన్ అయ్యేలా చేసుకుంటే.. జాబ్ కొట్టడం పెద్ద విషయమేమి కాదు.. మరి ఇంకెందుకు ఆలస్యం.. ప్రిపరేషన్ షురూ చేయండి.. ఆల్ ది బెస్ట్ ఆస్పిరంట్స్..

ALSO READ: Hyderabad ECIL: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. మంచి వేతనం

Related News

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

PNB LBO: నిరుద్యోగులకు పండుగే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు బ్రో

SEBI JOBS: సెబీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.1,26,100 జీతం, దరఖాస్తు ప్రక్రియ షురూ

BEL Notification: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. బీటెక్ పాసైతే చాలు, జీతం అక్షరాల రూ.1,40,000

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. జిందగీలో ఇలాంటి జాబ్ కొట్టాలి భయ్యా.. లైఫ్ అంతా సెట్

BSF Jobs: బీఎస్ఎఫ్ నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, భారీ శాలరీ

RRC NWR: రైల్వేలో 2162 ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు రూ.100 మాత్రమే.. ఇంకా ఒక్క రోజే గడువు

Big Stories

×