Hyderabad ECIL: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. ఈసీఐఎల్ హైదరాబాద్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బీఈ, బీటెక్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. హైదరాబాద్ లో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పోస్టులు, ఖాళీల వివరాలు, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కాంట్రాక్ట్ విధానంలో 160 టెక్నికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 160 పోస్టులు
హైదరాబాద్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో టెక్నికల్ ఆఫీసర్ సి ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు వాటి వివరాలు..
టెక్నికల్ ఆఫీసర్ సి: 160 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ అర్హతలు ఉన్నవారికి ఇది అద్భుత అవకాశం. వెంటనే దరఖాస్తు చేసుకోండి.
జీతం: ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు మొదటి ఏడాది రూ.25,000 జీతం ఉంటుంది. రెండో ఏడాది రూ.28,000 జీతం ఉంటుంది. మూడు, నాలుగో ఏడాది రూ.31,000 జీతం ఉంటుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతలు, వర్క్ ఎక్స్ పీరియన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 22
ALSOO READ: APSRTC Notification: ఏపీఎస్ఆర్టీసీలో 281 ఉద్యోగాలు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు