ECIL Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. హైదరాబాద్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగాలు, పోస్టులు వాటి వివరాలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హైదరాబాద్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 412 ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 412
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వివిధ రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. వివిధ ట్రేడుల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఉద్యోగాలు – వెకెన్సీలు వారీగా..
ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 95 పోస్టులు
ఎలక్ట్రీషియన్ : 61 పోస్టులు
ఫిట్టర్: 130 పోస్టులు
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (సీవోపీఏ) : 51 పోస్టులు
మెకానిక్: 3 పోస్టులు
టర్నర్: 15 పోస్టులు
వెల్డర్ : 22 పోస్టులు
మెషినిస్ట్ : 12 పోస్టులు
మెషినిస్ట్ (జి) : 2 పోస్టులు
పెయింటర్ : 9 పోస్టులు
కార్పెంటర్ : 6 పోస్టులు
ప్లంబర్ : 3 పోస్టులు
మెకానిక్ డ్రాఫ్ట్స్ మెన్: 3 పోస్టులు
విద్యార్హత: ఐటీఐ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎన్ సీటీవీ సర్టిఫికెట్ ఉండాలి.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 సెప్టెంబర్ 1
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 22
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తేదీ: అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 9 వరకు
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.ecil.co.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ కూడా ఉంటుంది. మరి ఇంకెందకు ఆలస్యం. వెంటనే ఐటీఐ అర్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 412
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 22
ALSO READ: Prasar Bharati Jobs: ప్రసార భారతిలో నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. మంచి వేతనం, ఇంకా 6 రోజుల సమయమే