E-Paper
Advertisement

Ap Education Department : ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర కార్యాలయంలో ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ ఇలా.?

Ap Education Department : ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర కార్యాలయంలో ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ ఇలా.?
Advertisement

Ap Education Department : ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్షా అభియాన్‌ విజయవాడలోని రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 37 పోస్టులు భర్తీ చేయనుంది.

జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీలు 13 , డేటా ఎంట్రీ ఆపరేటర్లు పోస్టులు 10 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి. టైపింగ్‌ స్కిల్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌/ పీజీడీసీఏ/ డీసీఏ/ ఇంజినీరింగ్‌ సర్టిఫికెట్‌/ కంప్యూటర్‌తో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి.

Advertisement

ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు 14 ఉన్నాయి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
తెలుగు, ఇంగ్లీషు భాషలు చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ఉగ్యోగార్థుల వయస్సు 30-11-2022 నాటికి 42 సంవత్సరాలు మించరాదు. వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. జేఏ, డీఈవో ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ మార్కులు, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకు పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుం : రూ.500
ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 31-01-2023
స్కిల్‌ టెస్ట్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాల ప్రకటన : 03-02-2023
ధ్రువపత్రాల పరిశీలన : 06-02-2023, 07-02-2023
స్కిల్‌ టెస్ట్‌ తేదీ : 11-02-2023, 12-02-2023
ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన : 13-02-2023
వెబ్‌సైట్‌: https://apssa.aptonline.in/#

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×