E-Paper
Advertisement

Pawan Kalyan: ఫ్యాన్స్‌ ఉన్నా ఓట్లెందుకు రాలేదు.. ప‌వ‌న్‌కు బాల‌య్య సూటి ప్ర‌శ్న‌

Pawan Kalyan: ఫ్యాన్స్‌ ఉన్నా ఓట్లెందుకు రాలేదు.. ప‌వ‌న్‌కు బాల‌య్య సూటి ప్ర‌శ్న‌
Advertisement

Pawan Kalyan:నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాప‌బుల్‌. తొలి సీజ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టంతో నిర్వాహ‌కులు అన్‌స్టాపబుల్ సీజ‌న్ 2ను నిర్వ‌హించారు. సీజ‌న్ వన్ కంటే సీజ‌న్ 2 ఇంకా అంచ‌నాల‌ను పెంచేసింది. అందుకు కార‌ణం.. ఈ సీజ‌న్‌లో ఇద్ద‌రు స్టార్స్ పార్టిసిపేట్స్ చేసిన ఎపిసోడ్స్‌. ఒక‌టేమో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఎపిసోడ్‌. ఇది న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు అంద‌రి క‌ళ్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్ పైనే ఉంది. బాప్ ఆప్ ఆల్ ఎపిసోడ్స్ అంటూ బాల‌కృష్ణ‌, ప వ‌న్ క‌ళ్యాణ్ కాంబో ఎపిసోడ్‌ను ఆహా ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చింది.

ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు, టాలీవుడ్ సెల‌బ్రిటీలే కాదు రాజ‌కీయ నాయ‌కులు కూడా ఈ ఎపిసోడ్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అందులో బాల‌కృష్ణ అడిగిన ప్ర‌శ్న‌లు వాటికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పిన స‌మాధానాలు ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచేస్తున్నాయి. బాల‌కృష్ణ మాట్లాడుతూ అంద‌రినీ అందుకే తాను బాల అని పిల‌వ‌మ‌ని చెబుతాను అంటూ చెప్ప‌గానే నేను ఓడిపోవ‌టానికి సిద్ధ‌మే కానీ, అలా పిల‌వ‌ను అని చెప్పేశారు. దానికి బాల‌య్య ఈ పాలిటిక్సే వ‌ద్దు అని అన‌టం ఆక‌ట్టుకుంటుంది. మ‌రో సంద‌ర్భంలో నీకు రాష్ట్రంలో ఉన్న వాళ్లంతా ఫ్యాన్సే క‌దా.. మ‌రి దాన్నెందుకు ఓట్లుగా మార్చుకోలేక‌పోయావు అని అని అడ‌గ్గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏదో స‌మాధానం చెప్పారు. అది ఎపిసోడ్‌లో చూస్తే కానీ తెలియ‌దు.

Advertisement

అన్న‌య్య చిరంజీవి నుంచి నేర్చుకున్నవి ఏవీ, ఏ అంశాల‌ను వ‌ద్దనుకున్నావు అని కూడా బాల‌య్య మ‌రో ప్ర‌శ్న వేశారు. ఈ ప్ర‌శ్న‌లు చూస్తుంటే ఎపిసోడ్ వాడి వేడిగానే సాగిన‌ట్లు అనిపిస్తుంది. మ‌రి ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంద‌నే దానిపై నిర్వాహ‌కులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మ‌రి త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×