NEET UG Counselling 2025: నీట్ యూజీ కౌన్సెలింగ్ 2025 ప్రక్రియ మొదలైంది. తొలి రౌండ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ సోమవారం నుంచి మొదలైంది. జులై 21 నుంచి మొదలై జూలై 28తో ముగియనుంది. ఆల్ ఇండియా కోటా సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలలో MBBS/ BDS/B.SC(నర్సింగ్) కోర్సుల ప్రవేశానికి NEET UG కౌన్సెలింగ్ 2025 ప్రక్రియ మొదలైంది.
దేశవ్యాప్తంగా ప్రభుత్వం మెడిల్, డెంటల్ కాలేజీల్లో 15 శాతం ఆల్ ఇండియా(MBBS) కోటా కింద, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS), ఇతర అనుబంధ వైద్య కార్యక్రమాలలో ప్రవేశానికి MCC NEET UG కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుంది. మిగిలిన 85 శాతం సీట్ల ప్రవేశాలకు యూజీ స్కోర్ ఆధారంగా రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు తమ రాష్ట్ర స్థాయి నీట్ యూజీ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాయి.
విద్యార్థులు అడ్మిషన్ కోసం కౌన్సెలింగ్‌లో పాల్గొనవలసి ఉంటుంది. తొలి రౌండ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్, చెల్లింపును జూలై 21 నుండి 28 వరకు జరగనుంది. దీనితోపాటు జూలై 22 నుండి 28 వరకు ఛాయిస్ ఫిల్లింగ్/లాకింగ్ కోసం అవకాశం ఉంటుంది.
సీట్ల కేటాయింపు ప్రక్రియ జులై 29 నుంచి 30 వరకు కొనసాగనుంది. దానికి సంబంధించిన ఫలితాలు జులై 31 విడుదల కానుంది. సీట్ల కేటాయింపు మాత్రం ఆగస్టు ఒకటి నుంచి ఆరు వరకు ప్రకటించనుంది. విద్యార్థులంతా మెడికల్ కౌన్సిల్ కమిటీ-MCC అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in ని సందర్శించవచ్చు.
ALSO READ: కోస్ట్‌గార్డులో ఉద్యోగాలు.. లక్షకు పైగా వేతనం, ఇంకా మూడు రోజులే సమయం
రెండవ దశ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 12 నుండి సెప్టెంబర్ 1 వరకు ఉండనుంది. మూడో దశ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 3 నుండి సెప్టెంబర్ 21 వరకు ఉంటుంది. స్ట్రార్ వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 22 నుండి సెప్టెంబర్ 27 వరకు పూర్తవుతుంది. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానం..
NEET UG కౌన్సెలింగ్-2025 రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in ని సందర్శించాలి. వెబ్‌సైట్ హోమ్ పేజీలో రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. అక్కడ అవసరమైన వివరాలను పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ తర్వాత, అభ్యర్థులు నిర్దేశించిన ఎంపిక నింపడం/లాకింగ్ చేయడం, రుసుము కూడా చెల్లించాలి. చివరగా అభ్యర్థులు పూర్తిగా నింపిన ఫారం సమర్పించాలి.