Hari Hara Veeramallu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ స్టార్ హీరోస్ లో మొదటి వినిపించే పేరు పవన్ కళ్యాణ్. కేవలం నటుడుగానే కాకుండా ఎన్నో స్పెషల్ టాలెంట్స్ పవన్ కళ్యాణ్ లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పొరపాటున నటుడు అయిపోయాను అని చెబుతూ ఉంటారు. లేకపోతే మంచి టెక్నీషియన్ అయ్యే వాడిని అంటారు. ఇది కూడా కొన్నిసార్లు నిజమే అనిపిస్తుంది దీనికి జానీ సినిమాకి దర్శకత్వం చేయడమే నిదర్శనం.
బాక్స్ ఆఫీస్ వద్ద జానీ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు కానీ ఒక దర్శకుడుగా మాత్రం పవన్ కళ్యాణ్ చాలామందిని ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే ఇంత మంచి దర్శకుడు పవన్ కళ్యాణ్ లో ఉన్నాడా అని అనిపించేలా ఉంటాయి కొన్ని షాట్స్. అలానే ఖుషి సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్సెస్ చేశారు.
18 నిమిషాల ఫైట్ సీక్వెన్స్
పవన్ కళ్యాణ్ కేవలం నటుడుగానే కాకుండా రచయిత,దర్శకుడుగా కూడా పేరు సాధించాడు. అలానే తనలోని సింగర్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పాడిన పాటలు బాగా వైరల్ కూడా అయ్యాయి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాలో ఏకంగా 18 నిమిషాల ఫైట్ సీక్వెన్స్ పవన్ కళ్యాణ్ డిజైన్ చేశారట. పవన్ కళ్యాణ్ ఫైట్ సీక్వెన్స్ డిజైన్ చేశారు అంటే అది ఎంత స్టైలిష్ గా ఉండబోతుందో అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ డిజైన్ చేసిన ఫైట్స్ వెండితెరపై చూస్తుంటే మంచి ఫీల్ వస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో ఉండబోతుంది అని అర్థమవుతుంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు జ్యోతి కృష్ణ తెలిపారు.
హరిహర వీరమల్లు పై ప్రత్యేక దృష్టి
పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే సినిమా చేసిన తర్వాత ఆ ప్రమోషన్స్ లో పెద్దగా కనిపించరు. ఆడియో లాంచ్ ఈవెంట్ పెడితే దానికి మాత్రమే హాజరవుతారు. అయితే ఈ సినిమాకు మాత్రం పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పుడు సినిమా ప్రెస్ మీట్ కు హాజరుకాని పవన్ కళ్యాణ్ ఈ ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. ఈ ప్రెస్ మీట్ లో ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. ఏం రత్నం, క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ వీళ్ల టాలెంట్ చెబుతూ ఈ సినిమా ఏ నేపథ్యంలో ఉండబోతుంది అని క్లారిటీ కూడా ఇచ్చేశారు కళ్యాణ్. ఈ ప్రెస్ మీట్ తో చాలా అంశాలకు క్లారిటీ కూడా వచ్చేసింది.
Also Read: Pawan Kalyan: మేకింగ్ వీడియో లో లేకపోయిన క్రిష్ పేరు గుర్తుపెట్టుకున్నాడు, మరి జ్యోతి కృష్ణ ?