భారతదేశంలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల విడుదలైన Vivo X Fold 5 ఈ రంగంలోకి బలంగా అడుగుపెట్టింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న Samsung Galaxy Z Fold 7, Google Pixel 9 Pro Fold దిగ్గజ కంపెనీల ఫోన్లకు గట్టి పోటీగా వివో నిలిచింది. డిజైన్, పనితీరు, ఫీచర్లు, ధర తదితరాల్లో ఈ మూడు ఫోన్‌ల మధ్య తేడాలు చూస్తే, ఏది బెస్ట్ అనే ప్రశ్నకు సమాధానం లభిస్తుంది.
ధర
ధర విషయంలో Google Pixel 9 Pro Fold తక్కువ ధరలో లభిస్తుంది. ₹1,29,999కి 16GB RAM, 256GB స్టోరేజ్ తో Flipkartలో అందుబాటులో ఉంది. Vivo X Fold 5 ధర ₹1,49,999. ఇది 16GB RAM, 512GB స్టోరేజ్‌తో వస్తుంది. అయితే Samsung Galaxy Z Fold 7 ధర అన్నింటి కంటే ఎక్కువ. ₹1,74,999 (256GB) నుంచి ₹2,10,999 (1TB) వరకు ఉంటుంది.
డిస్‌ప్లే, బ్రైట్ నెస్
Vivo ఫోన్‌లో 8.03 అంగుళాల పెద్ద అమోలెడ్ ఫోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 4500 నిట్స్ ప్రైమ్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కవర్ డిస్‌ప్లే 6.53 అంగుళాలు.
Samsung Z Fold 7లో 8 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లే ఉంది, దీని ప్రకాశం 2600 నిట్స్. Pixel ఫోల్డ్‌లో 8 అంగుళాల LTPO OLED స్క్రీన్, 6.3 అంగుళాల అవుటర్ డిస్‌ప్లే ఉన్నాయి, రెండు 120Hz ఫ్రీక్వెన్సీతో 2700 నిట్స్ ప్రకాశాన్ని ఇస్తాయి.
ప్రాసెసర్, పనితీరు
Vivo ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, అడ్రెనో 750 GPU తో వస్తుంది. Samsung ప్రత్యేకంగా ట్యూన్ చేసిన స్నాప్ డ్రాగన్ 8 Elite OC ఉపయోగిస్తుంది. Google Pixel 9 Pro Fold లో టెన్‌సోర్ G4 చిప్ ఉంటుంది, ఇది గూగుల్ AI ఫీచర్లు, గోప్యతను ప్రధానంగా ఉద్దేశించి రూపొందించబడింది.
RAM, స్టోరేజ్
Samsung ఎక్కువ ఎంపికలు ఇస్తోంది: 12GB నుండి 16GB RAM, 256GB నుండి 1TB స్టోరేజ్ వరకు. Vivo ఒకే వేరియంట్‌ను ఆఫర్ చేస్తోంది — 16GB RAM, 512GB స్టోరేజ్. Pixel కూడా ఒకే వేరియంట్ — 16GB RAM, 256GB స్టోరేజ్.
కెమెరా పనితీరు
కెమెరా అభిరుచులకు Samsung అగ్రస్థానంలో ఉంది — 200MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్, 10MP టెలీఫోటో. Vivo లో మూడు 50MP కెమెరాలు ఉన్నాయి. పిక్సెల్ ఫోల్డ్‌లో 48MP ప్రధాన కెమెరా, 10.5MP అల్ట్రా వైడ్, 10.8MP టెలీఫోటో ఉన్నాయి.
బ్యాటరీ, ఛార్జింగ్
ఈ విషయంలో మాత్రం Vivo స్పష్టంగా ఆధిక్యంలో ఉంది. 6000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్. Samsung లో 4400mAh బ్యాటరీ, కేవలం 25W ఛార్జింగ్. Pixel లో 4650mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ అందిస్తుంది.
సాఫ్ట్‌వేర్, కనెక్టివిటీ
మూడు ఫోన్లు Android 16తో వస్తాయి. Vivo లో ఫన్ టచ్ OS 15, Samsung లో One UI 8, Pixel లో Pure Android. కనెక్టివిటీ విషయాల్లో ముగ్గురూ సమానమే — Wi-Fi 7, USB 3.2, NFC, బ్లూ టూత్ వంటివి ఉన్నాయి.
Also Read: సామ్‌సంగ్‌కు షాకిచ్చిన టెక్నో.. ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ త్వరలోనే!
మూడు ఫోల్డబుల్ ఫోన్‌లలో ప్రతి ఫోన్ వివిధ ప్రత్యేకతలు ఉన్నాయి. Vivo బ్యాటరీ, బ్రైట్ నెస్ విషయంలో ముందుంది; Samsung కెమెరా, స్టోరేజ్ ఎంపికలతో మెరుగ్గా ఉంది; Google Pixel ధర తక్కువగా ఉండి, మంచి ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ అనుభవం, AI ఫీచర్లతో ఆకర్షిస్తుంది. ఈ ఫీచర్లలో మీ అవసరాన్ని బట్టి ఏది ఏ మీకు బెస్ట్ అనేది నిర్ణయించుకోండి.