BigTV English

CBHFL Recruitment: ఒక్క ఇంటర్వ్యూతోనే ఉద్యోగం.. ఇంటర్, డిగ్రీ ఉంటే చాలు.. పూర్తి వివరాలివే..

CBHFL Recruitment: ఒక్క ఇంటర్వ్యూతోనే ఉద్యోగం.. ఇంటర్, డిగ్రీ ఉంటే చాలు.. పూర్తి వివరాలివే..

CBHFL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఇంటర్‌, డిగ్రీ, పీజీ, సీఏ, సీఎస్‌, ఐసీడబ్ల్యూ, సీఎఫ్‌ఏ, ఎంబీ, ఎల్ఎల్‌బీ, బీటెక్‌(సివిల్) పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. సెంట్ బ్యాంక్ ఆఫ్ హోం ఫైనాన్స్ లిమిటెడ్(CBHFL) లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.


ముంబయిలోని సెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (Cent Bank Home Finance Limited) ఖాళీగా ఆఫీసర్‌, మేనేజర్‌ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 212


ముంబయిలోని సెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌ లో వివిధ రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు..

అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌: 15
సీనియర్‌ మేనేజర్‌: 02
 మేనేజర్‌: 48
 అసిస్టెంట్‌ మేనేజర్‌: 02
 జూనియర్ మేనేజర్‌: 34
ఆఫీసర్‌: 111

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 25

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి ఇంటర్, డిగ్రీ లేదా సీఏ, పీజీ, సీఎస్‌, ఐసీడబ్ల్యూ, సీఎఫ్‌ఏ, ఎంబీ, ఎల్ఎల్‌బీ, బీటెక్‌(సివిల్)లో పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌కు 30 నుంచి 45 ఏళ్లు, మేనేజర్‌కు 25 నుంచి 35 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌కు 28 నుంచి 40 ఏళ్లు, అసిస్టెంట్‌ మేనేజర్‌కు 23 నుంచి 32 ఏళ్లు, జూనియర్‌ మేనేజర్‌కు 21 నుంచి 28 ఏళ్లు, ఆఫీసర్‌కు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుకు రూ.1000 ఫీజు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కల్పించనున్నారు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.jobapply.in/cbhfl2025/

అన్ లైన్ అప్లికేషన్ లింక్: https://www.jobapply.in/cbhfl2025/Registration.aspx

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ జాబ్స్ కు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 212

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 25

ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా నియమిస్తారు.

ఇది కూడా చదవండి: NGT Recruitment: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు.. రేపే లాస్ట్ డేట్

ఇది కూడా చదవండి: Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. రూ.లక్షల్లో శాలరీ.. రేపే లాస్ట్ డేట్..

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×