National Green Tribunal Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎల్ఎల్‌బీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పలు రకాల ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
నేషనల్ గ్రీన్ ట్యిబ్యునల్ లో ప్రిన్సిపల్ బ్రాంచ్, న్యూఢిల్లీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 15 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 18
నేషనల్ గ్రీన్ ట్యిబ్యునల్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ, అకౌంట్స్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
అసిస్టెంట్ రిజిస్ట్రార్: 03
ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ: 01
అకౌంట్స్ ఆఫీసర్: 01
ప్రైవేట్ సెక్రటరీ: 13
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 15
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా ఎల్ఎల్‌బీ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు రూ.67,700 – రూ.2,08,700, అకౌంట్స్ ఆఫీసర్‌కు రూ.53,100 – రూ.1,67,800, ప్రైవేట్ సెక్రటరీకు రూ.47,600 – రూ.1,51,100 వేతనం ఉంటుంది.
చిరునామా: అభ్యర్థులు అప్లికేషన్ ను రిజిస్ట్రార్ జనరల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ప్రిన్సిపల్ బ్రాంచ్, ఫరీద్ కోట్ హౌస్, కోపర్నికస్ మర్గ్, న్యూ దిల్లీ-110001 చిరునామాకి పంపించాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.greentribunal.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు రూ.67,700 – రూ.2,08,700, అకౌంట్స్ ఆఫీసర్‌కు రూ.53,100 – రూ.1,67,800, ప్రైవేట్ సెక్రటరీకు రూ.47,600 – రూ.1,51,100 వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 18
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 15
ఇది కూడా చదవండి: Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. రూ.లక్షల్లో శాలరీ.. రేపే లాస్ట్ డేట్..