E-Paper
Advertisement

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 350 ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలివే

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 350 ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలివే
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ విభాగమైన ‘ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమరియా’ (OFK) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లో ఉన్న ఈ ఫ్యాక్టరీలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 టెన్యూర్ బేస్డ్ డెంజర్ బిల్డింగ్ వర్కర్ (DBW) పోస్టులను భర్తీ చేయనున్నారు. రక్షణ రంగంలో పనిచేయాలనే ఆసక్తి గల యువతకు ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 350

విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ (AOCP) ట్రేడ్‌లో నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) నుంచి ఎన్ఏసీ (NAC) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీనితో పాటు ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ వంటి ఇతర ఫీడర్ ట్రేడ్ల వారు సైతం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు.

Advertisement

వయస్సు: అభ్యర్థుల వయసు దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ఐదేళ్లు వయో సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, మాజీ సైనికులకు నిర్ణీత వయో సడలింపు వర్తిస్తుంది.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 ప్రాథమిక వేతనం అందుతుంది. దీనికి అదనంగా కరవు భత్యం (DA) సహా ఇతర ప్రయోజనాలు కల్పిస్తారు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగుతుంది. ఎన్‌సీటీవీటీ (NCTVT) మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇస్తారు. మిగిలిన 20 శాతం వెయిటేజీని ట్రేడ్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా నిర్ణయిస్తారు. ఈ రెండు విభాగాల్లో ప్రతిభ చూపిన వారిని తుది జాబితాకు ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలు ప్రారంభంలో ఒక సంవత్సరం కాలపరిమితికి మాత్రమే ఉంటాయి. ఫ్యాక్టరీ అవసరాలు, అభ్యర్థి పనితీరును బేరీజు వేసుకుని గరిష్ఠంగా నాలుగు సంవత్సరాల వరకు ఈ గడువును పొడిగించే అవకాశం ఉంటుంది.

ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తుకు అవసరమైన స్టడీ సర్టిఫికెట్లను జతచేసి పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

చిరునామా:  ది చీఫ్ జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమరియా, జిల్లా: జబల్‌పూర్, మధ్యప్రదేశ్, పిన్ – 482005.

ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజులలోపు దరఖాస్తులు కార్యాలయానికి చేరుకోవాలి.

గడువు దాటిన తర్వాత వచ్చిన దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక నోటిఫికేషన్లను గమనిస్తూ ఉండాలి.

నోెటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శిచవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://munitionsindia.in/

ALSO READ: సింగరేణి కోసం మరో ఉద్యమం.. ప్రభుత్వంపై కవిత నిప్పులు!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×