E-Paper
Advertisement

RBI Internship 2026: ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్ షిప్.. నెలకు రూ.20 వేలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

RBI Internship 2026: ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్ షిప్.. నెలకు రూ.20 వేలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్
Advertisement

RBI Internship 2026: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2026 సంవత్సరానికి సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు ఆహ్వానించింది. విద్యార్థులకు నిపుణుల పర్యవేక్షణలో ఆర్థిక, ఆర్థిక నియంత్రణ, విధానపరమైన అంశాలపై అవగాహన కల్పిస్తుంది. దరఖాస్తులు డిసెంబర్ 15, 2025తో ముగియనున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్, లా, కామర్స్, ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు, లా కోర్సులో ప్రొఫెషనల్ బ్యాచిలర్ డిగ్రీ, అలాగే చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏటా 125 మంది విద్యార్థులకు అవకాశం

ఆర్బీఐ ఇంటర్న్‌షిప్‌ 2026 ఏప్రిల్‌ నుంచి జులై వరకు మూడు నెలల పాటు ఉంటుంది. ఇంటర్న్ షిప్ ఇంటర్వ్యూలు జనవరి-ఫిబ్రవరి మధ్యలో నిర్వహించనున్నారు. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.20,000 చొప్పున స్టైఫండ్ లభిస్తుంది. ఏటా 125 మంది విద్యార్థులను ఈ ప్రోగ్రామ్ కు ఎంపిక చేస్తున్నారు. ఎంపికైన విద్యార్థుల పేర్లు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ప్రకటిస్తారు. దరఖాస్తులు ముగిసిన తర్వాత, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలు జరుగుతాయి. తుది ఎంపికలు ఫిబ్రవరి, మార్చి మధ్య ఉంటాయి.

దరఖాస్తు విధానం

  • అర్హులైన అభ్యర్థులు అధికారిక ఆర్బీఐ ఇంటర్న్‌షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆర్బీఐ ఇంటర్న్ షిప్ పోర్టల్ opportunities.rbi.org.inలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • వ్యక్తిగత, విద్యా సమాచారంతో ఫామ్‌ను పూర్తి చేయండి.
  • ఇటీవలి ఫొటోగ్రాఫ్, స్కాన్ చేసిన సంతకం అప్‌లోడ్ చేయాలి.
  • కాలేజీ ఐడీ, బోనఫైడ్ లేదా ఆథరైజేషన్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి.
Advertisement

ఎంపికైన విద్యార్థులు దేశంలోని వివిధ ఆర్బీఐ కార్యాలయాలలో శిక్షణ పొందుతారు. రియల్-టైమ్ ప్రాజెక్ట్‌లు, పరిశోధన పనులు, డేటా విశ్లేషణ, డాక్యుమెంట్ సమీక్ష, డిపార్ట్‌మెంటల్ సహాయానికి వారిని ఉపయోగిస్తారు. ఇంటర్న్‌లు బ్యాంకింగ్ నియంత్రణ, ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వం, సమ్మతి, డేటా విశ్లేషణలు, ఆర్థిక అధ్యయనాలు వంటి రంగాలలో పని చేయవచ్చు.

Also Read: IB: రూ.56,900 జీతంలో ఐబీలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు.. APPLY NOW

స్టైపెండ్, ప్రయోజనాలు

Advertisement

ఎంపికైన ఇంటర్న్‌లకు నెలకు రూ. 20,000 స్టైపెండ్ లభిస్తుంది. ఆర్బీఐ ఎలాంటి వసతి కల్పించనప్పటికీ, అవుట్‌స్టేషన్ ఇంటర్న్‌లు వారికి కేటాయించిన ఇంటర్న్‌షిప్ ప్రదేశానికి ప్రయాణించడానికి AC II-టైర్ రిటర్న్ రైలు ఛార్జీని తిరిగి పొందవచ్చు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×