
NTPC : ఢిల్లీలోని ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌టీపీసీ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆపరేషన్, మెయింటెనెన్స్ విభాగాల్లో మొత్తం 300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60% మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి. ఏడేళ్ల పని అనుభవం కూడా ఉండాలి. వయస్సు 35 సంవత్సరాలు మించరాదు.
ఎంపిక : పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు రుసుం : రూ.300
(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు )
ఆన్‌లైన్ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 02-06-2023
వెబ్‌సైట్ : https://carees.ntpc.co.in/recruitment/index.php.