Big Stories

Sharmila : డీకేతో షర్మిల భేటీ.. ఆ పదవి ఆఫర్..? కాంగ్రెస్ వ్యూహమిదేనా..?

Sharmila News Today(Telugu breaking news) : తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ హాట్ టాపిక్‌గా మారారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఒంటరిగా బరిలోకి దిగుతారా? ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటారా ? ఈ చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా షర్మిల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో బెంగళూరులో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. . డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల డీకే పుట్టిన రోజున కూడా షర్మిల బెంగళూరుకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. ఇలా రెండువారాల వ్యవధిలోనే డీకేతో షర్మిల రెండుసార్లు భేటీ కావడం అనేక సందేహాలను రేకెత్తిస్తోంది.

- Advertisement -

డీకే శివకుమార్‌తో షర్మిల భేటీలు ఆసక్తిని రేపుతున్నాయి. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన తెచ్చారని టాక్ నడుస్తోంది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు ఇచ్చే విషయంలో చర్చ జరుగుతోందనే వార్తలు వస్తున్నాయి. ఇలా షర్మిలను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ వ్యవహారాన్ని స్వయంగా ప్రియాంక గాంధీనే పరిశీలిస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే బాధ్యతను డీకేకు అప్పగించారని అంటున్నారు.

- Advertisement -

వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారనే ప్రచారంపై షర్మిల ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. విలీనం చేసేందుకు తాను పార్టీ పెట్టలేదని స్పష్టం చేశారు. షర్మిలకు బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయని అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో డీకేను వెళ్లి కలిశారనేది మరో వాదన. గతం నుంచి డీకే కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా ఆమె మర్యాదపూర్వకంగా కలిశారని వైఎస్ఆర్టీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఓ వైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూనే కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను మాత్రం షర్మిల కలవడం ఆసక్తిని రేపుతోంది. డీకే, షర్మిల వరుస భేటీల వెనుక ఉన్న అజెండా ఏంటి? నిజంగానే షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఏపీ బాధ్యతలు అప్పగించి అన్నకు చెల్లితో చెక్ పెట్టాలని భావిస్తున్నారా? కాంగ్రెస్ ప్లాన్ ఇదేనా..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News