E-Paper
Advertisement

RRB Paramedical Recruitment 2024: డిగ్రీ, డిప్లొమా అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

RRB Paramedical Recruitment 2024: డిగ్రీ, డిప్లొమా అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
Advertisement

RRB Paramedical Recruitment 2024: రైల్వే రిక్రూట్‌‌మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పారా మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ రైల్వే రీజియన్లలోని 1,376 పారామెడికల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్ఆర్‌బీ రీజియన్లు:
సికింద్రాబాద్, బెంగళూరు, పాట్నా, ముంబై, అహ్మదాబాద్, చెన్నై, ముజాఫ‌‌ర్‌పుర్, అజ్‌మెర్, గోరఖ్‌పూర్, గువాహటి, ప్రయాగ్ రాజ్, భోపాల్ జమ్మూ కాశ్మీర్, భువనేశ్వర్ ,కలకత్తా, మాల్దా, సిలిగురి, తిరువనంతపురం.

Advertisement

మొత్తం ఖాళీల సంఖ్య – 1376.
అర్హతలు: అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్,జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు రూ. 250 ఇతరులకు రూ. 500.

Advertisement

ఎంపిక విధానం: సీబీటీ కంప్యూటర్ ఆధారిత టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వ్రాత పరీక్ష: ప్రొఫెషనల్ ఎలిజిబిలిటీ 70 ప్రశ్నలు 70 మార్కులు. జనరల్ అవేర్‌నెస్.. 10 ప్రశ్నలు 10 మార్కులు. జనరల్ అర్థమెటిక్ ,జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్.. 10 ప్రశ్నలు 10 మార్కులు. జనరల్ సైన్స్ 10 ప్రశ్నలు.. 10 మార్కులు. మొత్తం 100 మార్కుల పరీక్ష 90 నిమిషాల సమయం ఉంటుంది.

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 3317 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్స్ ప్రారంభం: ఆగస్టు 17, 2024.
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 16, 2024.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×