Jigris Movie : టాలీవుడ్ యంగ్ హీరోలు రామ్ నితిన్, కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’. సెలబ్రిటీల అండతో ఈ చిన్న సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా ఈ మూవీ సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఫన్ అండ్ రోడ్ ట్రిప్ సినిమా ‘జిగ్రీస్’ను, మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మూవీపై అంచనాలను పెంచాయి. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ‘జిగ్రీస్’ నుంచి తాజాగా సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘మీరేలే’ అంటూ ఎమోషనల్ గా సాగిన ఈ సాంగ్ ను క్రేజీ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా రిలీజ్ చేయగా, ఆయన సాంగ్ బాగుందని ప్రశంసిస్తూ మూవీ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.
‘మీరని నేనని వేరుగ లేమని’ అంటూ సాగిన లిరిక్స్ వినసొంపుగా ఉన్నాయి. ఇక ఈ ట్రూ ఎసెన్స్ ఆఫ్ లవ్ అండ్ ఎమోషనల్ సోల్ ఫుల్ సాంగ్ మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ పాటకు హరీష్ రెడ్డి ఉప్పుల లిరిక్స్ అందించగా, సింగర్ ఏక్ నాథ్ ఆలపించారు. సయ్యద్ కమ్రాన్ సంగీతం అందించారు.
కాగా ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ను లాంచ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ‘జిగ్రీస్’ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ ‘తిరిగే భూమి’ని ఆగస్టు 30న సెన్సేషనల్ హీరో కిరణ్ అబ్బవరం రిలీజ్ చేశారు. అంతకు ముందు అంటే ఆగస్టులో ఈ సినిమా టీజర్‌ను పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు. టీజర్ తో మొదలైన ప్రమోషన్స్ జోరు ఇంకా కొనసాగుతోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. నవంబర్ 14న ‘జిగ్రీస్’ మూవీ భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది ఈ మూవీ. పైగా సందీప్ రెడ్డి వంగా వంటి పాన్ ఇండియా డైరెక్టర్స్ నుంచి మొదలు పెడితే కిరణ్ అబ్బవరం, తరుణ్ భాస్కర్ వంటి క్రేజీ స్టార్స్ సపోర్ట్ కూడా ఉంది. మరి మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ట్రిప్ బేస్డ్ యూత్ ఫుల్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.
Read Also : కర్ణాటక కదంబ రాజవంశం నిధికి దేవత కాపలా… దాన్ని టచ్ చేయాలన్న ఆలోచనకే పోతారు… ‘కాంతారా’లాంటి క్రేజీ థ్రిల్లర్