E-Paper
Advertisement

తెలంగాణ దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అడ్మిషన్ల కంప్లీట్ షెడ్యూల్ ఇదే!

తెలంగాణ దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అడ్మిషన్ల కంప్లీట్ షెడ్యూల్ ఇదే!
Advertisement

Telangana dost 2026: తెలంగాణలోని ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ (DOST) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. మూడు విడతల్లో జరిగే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీల్లో సీట్లను సొంతం చేసుకోవచ్చు. పూర్తి షెడ్యూల్, అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.

తెలంగాణ దోస్త్ (DOST) 2026-27 పూర్తి షెడ్యూల్:

Advertisement

ఫస్ట్ ఫేజ్ (Phase 1):
దోస్త్ ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతుంది.

1.రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు విద్యార్థులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.

Advertisement

2.వెబ్ ఆప్షన్లు: ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు నచ్చిన కాలేజీలను ఎంచుకోవచ్చు.

3. సీట్ల కేటాయింపు: మే 14న ఫస్ట్ ఫేజ్  సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలవుతాయి. సీటు వచ్చిన వారు వెంటనే ఆన్‌లైన్‌లో ‘సెల్ఫ్ రిపోర్టింగ్’ చేయాల్సి ఉంటుంది.

సెకండ్ ఫేజ్ (Phase 2):
తొలి విడతలో సీటు రాని వారు లేదా మెరుగైన కాలేజీ కోరుకునే వారు సెకండ్ ఫేజ్‌లో పాల్గొనవచ్చు.

1.రిజిస్ట్రేషన్: మే 15 నుంచి మే 25 వరకు అవకాశం ఉంటుంది.

2.వెబ్ ఆప్షన్లు: మే 15 నుంచి మే 26 వరకు ఇచ్చుకోవచ్చు.

3.సీట్ల కేటాయింపు: మే 30న సెకండ్ ఫేజ్ ఫలితాలు వస్తాయి.

మూడో విడత (Phase 3):

1.రిజిస్ట్రేషన్: మే 31 నుంచి జూన్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు.

2.వెబ్ ఆప్షన్లు: జూన్ 16 వరకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది.

3.సీట్ల కేటాయింపు: జూన్ 20న ఫలితాలు ప్రకటిస్తారు.

కాలేజీలో అడ్మిషన్ , తరగతులు:
సీట్లు ఖరారైన విద్యార్థులందరూ జూన్ 20 నుంచి జూన్ 27వ తేదీ మధ్య సంబంధిత కాలేజీలకు స్వయంగా వెళ్లి తమ అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.

ఓరియంటేషన్: జూన్ 29, 30 తేదీల్లో విద్యార్థులకు కాలేజీ వాతావరణంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.

తరగతుల ప్రారంభం: డిగ్రీ ఫస్ట్ ఇయర్ తరగతులు జూలై 1 నుంచి ప్రారంభమవుతాయి.

విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: సీటు వచ్చిన ప్రతి విద్యార్థి నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదంటే ఆ సీటు రద్దయ్యే అవకాశం ఉంది.

సర్టిఫికేట్లు: అడ్మిషన్ సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు సిద్ధంగా ఉంచుకోవాలి.

వెబ్ ఆప్షన్లు: ఆప్షన్లు ఇచ్చేటప్పుడు ప్రాధాన్యత క్రమాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×