BigTV English

Group-3 Selection List: తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. ప్రొవిజినల్ జాబితా విడుదల.. నేటి నుంచి వెబ్ ఆప్షన్స్

Group-3 Selection List: తెలంగాణ  గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. ప్రొవిజినల్ జాబితా విడుదల.. నేటి నుంచి వెబ్ ఆప్షన్స్

Group-3 Selection List: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) గ్రూప్-3 ప్రొవిజినల్ సెలక్షన్ జాబితా సోమవారం విడుదలైంది. ఈ జాబితాలో అభ్యర్థులు మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రక్రియ ప్రారంభమైంది.


అభ్యర్థులు అక్టోబర్ 10 సాయంత్రం 5.30 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. టీజీపీఎస్సీ గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ ను ఈ ఏడాది మార్చి 14న విడుదల చేసింది. గత ఏడాది నవంబర్ 17, 18ల్లో గ్రూప్-3 రాత పరీక్షలు నిర్వహించారు. దాదాపు 2.67 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు.

మొత్తం 1388 గ్రూప్-3 పోస్టులకు ప్రొవిజనల్‌ సెలక్షన్‌ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మెరిట్ ఆధారంగా 4,421 మంది అభ్యర్థులను జనరల్ కేటగిరీలో, 81 మందిని స్పోర్ట్స్ కోటా కింద ఎంపిక చేశారు.


వచ్చే నెలాఖరులోగా ఫలితాలు!

గ్రూప్‌-3 కేటగిరీలో 1,388 ఖాళీలకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనంతరం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించాలని భావించారు. గ్రూప్‌-3 ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ మార్చి నెలలోనే విడుదల చేసింది. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు తేదీలు సైతం ప్రకటించింది. ఇంతలో గ్రూప్‌-1 ఫలితాలపై హైకోర్టులో కేసు నమోదు కావడంతో గ్రూప్ -3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు బ్రేక్ పడింది. .

గ్రూప్‌-1, గ్రూప్-2 కొలిక్కి రావడంతో గ్రూప్‌-3 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను చేపట్టనుంది టీజీపీఎస్సీ. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అక్టోబర్ నెలాఖరుకల్లా గ్రూప్‌-3 తుది జాబితా వెలువడే అవకాశం ఉందని సమాచారం.

ఇటీవల గ్రూప్-2 ఫలితాలు విడుదల

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఆదివారం గ్రూప్-2 తుది ఫలితాలు విడుదల చేసింది. కమిషన్ వెబ్ సైట్(https://websitenew.tgpsc.gov.in/) లో ఫైనల్ రిజల్ట్స్ జాబితాను ఉంచింది. మొత్తం 783 పోస్టులకు గానూ 782 మందిని ఎంపిక చేసింది. ఒక పోస్టు ఫలితాన్ని టీజీపీఎస్సీ పెండింగ్ లో పెట్టింది. 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా.. 2024 డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది మార్చిలో జనరల్ ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన అనంతరం ఆదివారం తుది ఫలితాలు విడుదల చేసింది.

Also Read: Bank Jobs: డిగ్రీ పాసైతే అప్లై చేసుకోవచ్చు.. భారీ వేతనం, ఇంకొన్ని గంటలే ఛాన్స్ బ్రో 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-II సర్వీసెస్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలకు 2025 మార్చి 11న జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేసింది.

Tags

Related News

SSC Police: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తు ప్రక్రియ షురూ, ఆలస్యం చేయకుండా..?

Bank Jobs: డిగ్రీ పాసైతే అప్లై చేసుకోవచ్చు.. భారీ వేతనం, ఇంకొన్ని గంటలే ఛాన్స్ బ్రో

JEE Main-2026: ఐఐటీ మెయిన్స్ అభ్యర్థులు అలర్ట్.. NTA కీలక సూచనలు

APSRTC: ఇది గోల్డెన్ ఛాన్స్.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు, ఇంకా 4 రోజులే గడువు

AIIMS Mangalagiri: మంగళగిరిలో ఉద్యోగాలు.. ఒక్క ఇంటర్వ్యూతోనే జాబ్, రూ.1,50,000 జీతం

BEL Notification: బీటెక్ అర్హతతో బెల్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.40వేలు, ఇంకెందుకు ఆలస్యం

IBPS Notification: ఇంకా ఒక్క రోజే.. ఇలాంటి అద్భుతమైన ఛాన్స్ మళ్లీ రాదు, డిగ్రీ ఉంటే జాబ్ ఉన్నట్టే..!

Big Stories

×