Kurnool Crime: కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పత్తికొండ పట్టణంలో ఆటోను లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.మరి కొంతమందికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన వారిని తుగ్గలి మండలం ముకెల గ్రామానికి చెందిన భూమిక (26), నితిక (5) తల్లీకూతుళ్లు, మరొకరు శిరీష(30)గా పోలీసులు గుర్తించారు. తల్లి కూతుళ్లు ఇద్దరు కలిసి శిరీషతో ఊరు వెళ్లేందుకు సమీపంలోని ఆటోస్టాండ్ వద్ద ఆటోలో వేచి చూస్తున్నారని పోలీసులు తెలిపారు. అదే సమయంలో అటు వైపుగా బియ్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి వెనక నుంచి ఆటోను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు..
ALSO READ: Chennai Crime: ఘోర ప్రమాదం.. పవర్ ప్లాంట్‌లో శ్లాబ్ కూలి 9 మంది స్పాట్‌డెడ్
ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందినట్టు పోలీసులు వివరించారు. ప్రమాదానికి గురైన ఆటో నుజ్జునుజ్జయిందని చెప్పారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: TVK Vijay: తొక్కిసలాటలో 41 మంది మృతి.. స్పందించిన టీవీకే చీఫ్ విజయ్