BigTV English

SSC Police: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తు ప్రక్రియ షురూ, ఆలస్యం చేయకుండా..?

SSC Police: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తు ప్రక్రియ షురూ, ఆలస్యం చేయకుండా..?

SSC Police: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఇంటర్ పాసైన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. నెలకు రూ.25,500- రూ.81,100 వరకు వేతనం ఉంటుంది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు – వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ద్వారా ఢిల్లీ పోలీస్‌- హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్‌ వైర్‌లెస్‌ ఆపరేటర్‌ (AWO)/టెలీ-ప్రింటర్‌ ఆపరేటర్‌) నియామక పరీక్ష- 2025 కోసం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫిషన్‌ ద్వారా మొత్తం 552 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన పురుషులు, మహిళా అభ్యర్థులు అక్టోబర్‌ 15 వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 509


స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో మొత్తం 552 ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వివరాలు

హెడ్ కానిస్టేబుల్: 552 పోస్టులు

ఇందులో..

హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) మేల్: 341 పోస్టులు

హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) మహిళలు : 168 పోస్టులు

విద్యార్హత: ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: వ్రాత పరీక్ష, ఫిజికిల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 29 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఎగ్జామ్ ఫీజు: రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 సెప్టెంబర్ 29

దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 20

కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్: 2025 డిసెంబర్, 2026 జనవరి నెలల్లో ఉండే అవకాశం ఉంది.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రందించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://ssc.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 జీతం ఉంటుది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ALSO READ: Bank Jobs: డిగ్రీ పాసైతే అప్లై చేసుకోవచ్చు.. భారీ వేతనం, ఇంకొన్ని గంటలే ఛాన్స్ బ్రో

Related News

Bank Jobs: డిగ్రీ పాసైతే అప్లై చేసుకోవచ్చు.. భారీ వేతనం, ఇంకొన్ని గంటలే ఛాన్స్ బ్రో

JEE Main-2026: ఐఐటీ మెయిన్స్ అభ్యర్థులు అలర్ట్.. NTA కీలక సూచనలు

APSRTC: ఇది గోల్డెన్ ఛాన్స్.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు, ఇంకా 4 రోజులే గడువు

AIIMS Mangalagiri: మంగళగిరిలో ఉద్యోగాలు.. ఒక్క ఇంటర్వ్యూతోనే జాబ్, రూ.1,50,000 జీతం

BEL Notification: బీటెక్ అర్హతతో బెల్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.40వేలు, ఇంకెందుకు ఆలస్యం

IBPS Notification: ఇంకా ఒక్క రోజే.. ఇలాంటి అద్భుతమైన ఛాన్స్ మళ్లీ రాదు, డిగ్రీ ఉంటే జాబ్ ఉన్నట్టే..!

RBI Recruitment: రూ.78,450 జీతంతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 3 రోజులే మామ.. మిస్ అవ్వొద్దు

Big Stories

×