Naga Vamsi : ఒక ఆలోచనను నమ్మి సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. అది భారీ రిస్క్. ఎందుకంటే మనకు నచ్చే ఆలోచన పదిమందికి నచ్చుతుంది అని గ్యారెంటీ లేదు. ఏ సినిమా ఎప్పుడు హిట్టవుతుందో ఎవరు చెప్పలేరు. అది ఎవరికీ తెలియదు కూడా. ఒకవేళ అదే తెలిస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని సూపర్ హిట్ సినిమాలే వస్తాయి. కొన్ని సినిమాలు బలంగా నమ్మి చేస్తుంటారు కొందరు నిర్మాతలు కానీ ఆ సినిమాలు బెడిసి కొడుతుంటాయి.
ఈ మధ్యకాలంలో యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీకి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కింగ్డమ్ సినిమా ఊహించని స్థాయి సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమా విషయంలో మంచి కాన్ఫిడెంట్ గా కనిపించేవారు వంశీ. సినిమా రిలీజ్ కి ముందు కూడా ఈ సినిమా విషయంలో ఎటువంటి క్వశ్చన్స్ మీరు పెట్టుకుని వచ్చినా కూడా వాటన్నిటికీ నేను సమాధానం ఇస్తాను అనే రేంజ్ లో మాట్లాడారు. కింగ్డమ్ సినిమా పరిస్థితి అటు ఉంచితే ఎన్నో అంచనాలతో తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన వార్ 2 సినిమా కూడా ఊహించిన సక్సెస్ ఇవ్వలేదు.
సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంటాడు నాగ వంశీ. గతంలో లియో, దేవర, వార్ వంటి ఎన్నో సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇప్పుడు తాజాగా హెచ్ వినోద్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమా హక్కులను కొనే ప్రయత్నంలో ఉన్నారట. రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కేవీఎన్ ప్రొడక్షన్స్ తో నాగ వంశీ చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన డీల్ మరో వారంలో పూర్తికానున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
మారుతి (director Maruti) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న రాజా సాబ్ (The Raja Saab) సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా జనవరి 9న విడుదలవుతుంది. అదే రోజు కూడా జననాయగన్ సినిమా విడుదల కానుంది. ప్రభాస్ వంటి స్టార్ హీరో సినిమాతో పాటు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో వంశీ రిలీజ్ చేయడం అంటే రిస్క్ అని చెప్పాలి. మరోవైపు తమిళ్లో మాత్రం ప్రభాస్ సినిమాను ఒక రోజు లేటుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ నాగ వంశీ హక్కులు కొంటే అటువంటి నిర్ణయాన్ని ఇక్కడ కూడా తీసుకుంటాడేమో చూడాలి. అలానే నాగ వంశీ నిర్మిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నవీన్ పోలిశెట్టి తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ సాధించుకున్నాడు. నవీన్ సినిమా అంటే ఖచ్చితంగా బాగుంటుంది అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది.
Also Read : Mega158 : మెగాస్టార్ సినిమా ముహూర్తం క్యాన్సిల్, ఆ సెంటిమెంట్ కోసమే వెయిటింగ్