Rishab Shetty : రిషబ్ శెట్టి దర్శకత్వంలో కాంతారా చాప్టర్ 1 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాంతారా సినిమా భారీ సక్సెస్ సాధించింది కాబట్టి చాప్టర్ 1 సినిమా పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ తరుణంలో సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్ తర్వాత సినిమాను బాయ్ కాట్ చేయాలి అంటూ ట్రెండ్ మొదలైంది. దీనికి కారణం రిషబ్ శెట్టి తెలుగు ఈవెంట్లో కేవలం కన్నడ మాట్లాడటమే. గతంలో రిషబ్ శెట్టి కొన్ని ఇంటర్వ్యూస్ లో తెలుగు కూడా మాట్లాడారు. కానీ ఆ ఈవెంట్ లో మాత్రం తెలుగు మాట్లాడలేదు. సోషల్ మీడియాలో దీని గురించి విపరీతంగా చర్చలు జరిగాయి. బహుశా అది చిత్ర యూనిట్ వరకు వెళ్లి ఉండవచ్చు. అందుకని ఇప్పుడు విజయవాడలో జరిగిన ఈవెంట్ లో కంప్లీట్ తెలుగులో మాట్లాడారు. వివాదానికి ముగింపు పలికారు అని ఇక్కడితో తేలిపోయింది.
రిషబ్ శెట్టి మాట్లాడుతూ… హ్యాపీ దసరా, ఇంత ప్రేమ ఇచ్చినందుకు, ఇన్ని దీవెనలు ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్. కాంతారా విడుదలై ఇది మూడవ సంవత్సరం. 2022లో ఇదే రోజున కాంతారా రిలీజ్ అయింది. అక్టోబర్ రెండవ తారీఖున చాప్టర్ 1 వస్తుంది. అంతే ఆశీర్వాదం ఇవ్వాలి. సపోర్ట్ చేయండి థాంక్యూ సో మచ్. నాకంత బాగా తెలుగు రాదు. కానీ నేను ట్రై చేస్తున్నాను.
నేను జై హనుమాన్ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ తో పనిచేస్తున్నాను. అప్పుడు నేను కరెక్ట్ గా తెలుగు నేర్చుకొని మాట్లాడుతాను.
స్పెషల్ గా మన సహోదరుడు జూనియర్ ఎన్టీఆర్ (NTR) , అలానే ట్రైలర్ రిలీజ్ చేసినందుకు ప్రభాస్ (Prabhas) . స్పెషల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (deputy CM Pawan Kalyan) గారికి థాంక్యూ సో మచ్. కన్నడ, కన్నడిగా తెలుగు మేమందరం సోదరులం అంటూ మాట్లాడారు.
మొత్తానికి రిషబ్ శెట్టి (Rishabh Shetty) తెలుగులో మాట్లాడలేదు అనే వివాదానికి ఈరోజుతో చెక్ పెట్టేసాడు. ఈ ఈవెంట్ లో కేవలం రిషబ్ శెట్టి మాత్రమే కాకుండా, తన వైఫ్ కూడా తెలుగులో మాట్లాడటం ఆశ్చర్యం. మొత్తానికి తెలుగు యువత అనుకున్నది సాధించి మరి రిషబ్ శెట్టి తో విజయవాడ సభలో తెలుగు ను మాట్లాడించారు. ఈ సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కూడా టికెట్ హైక్స్ ఇచ్చారు. దీని గురించి కూడా సోషల్ మీడియాలో కొన్ని చర్చలు జరిగాయి. డబ్బింగ్ సినిమాకి హైక్స్ ఎందుకు అంటూ కొంతమంది పోస్టులు పెట్టారు. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ కూడా రేపటి నుంచి మొదలుకానున్నాయి. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.
Also Read : Naga Vamsi: ఆ సినిమా హక్కుల కోసం నాగ వంశీ ప్రయత్నం, ప్రభాస్ తో పోటీ అవసరమా?